గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత
- ఇంటింటా ఎన్నికల ప్రచారంలో ఆకుతోటపల్లి సర్పంచ్ అభ్యర్థి జి .వెంకట రమణమ్మ
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ :
ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఆకుతోటపల్లి గ్రామ పంచాయతీని అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం చూపుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జి.వెంకటరమణమ్మ తెలిపారు. ఆదివారం ఆకుతోటపల్లి గ్రామపంచాయతీలో ఆమె వార్డు సభ్యులు నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ మంచం గుర్తుకు ఓటు వేయాలని గ్రామ ప్రజలను కోరారు. వార్డు సభ్యులకు ఓటు వేసి వార్డు సభ్యులందరినీ గెలిపించాలని కోరారు. ఆకుతోటపల్లి గ్రామంలో రోడ్ల , వీధిలైట్ల ఏర్పాటు, అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు, వృద్ధులు, వితంతువులకు పింఛన్లు అందేలా కృషి చేస్తానన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు మెరుగైన వసతులు అందించడమే తన ప్రాధాన్యత అని ఆమె పేర్కొన్నారు , ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వారిని ఎన్నుకోవాలని జి. వెంకటరమణమ్మ ప్రజలను కోరారు. గ్రామ ప్రజలు మంచిని ఆలోచించి జరగబోయే ఎన్నికల్లో మంచం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.