BREAKING
రాష్ట్రస్థాయి కరాటిపుటీల్లో కాంస్య పతకం పొన్నూరు పట్టణం 29వ వార్డులో వైసీపీ అభ్యర్థి గేరా కుమారి ముమ్మర ప్రచారం పెదంచల గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పీరికట్ల అంజి ఏకగ్రీవ ఎన్నిక. కేబీసీ 18 వివాదం: అమితాబ్ బచ్చన్, సోనీ టీవీకి లీగల్ నోటీసులు రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి. పిసినికాడ జాతీయ రహదారిపై ప్రమాదం. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తా రాజమహేంద్రవరం అభివృద్ధికి త్రిబుల్ ఇంజన్ సర్కార్ అవసరం పలాసలో మాక్ కౌన్సిల్ సమావేశం. వైస్ చైర్మన్ ఎంపికపై ఎమ్మెల్యే గౌతు శిరీష, వెంకన్న చౌదరి దిశానిర్దేశం. వైద్య సేవలో ఆర్.ఎం.పి పి.ఎం.పి సేవల పాత్ర కీలకం ఏపీలో రేపు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక.. 66 స్థానాలకు కూటమి జాబితా విడుదల సామూహిక వేదపారాయణంతో మార్మోగిన సాయి సమితి ప్రాంగణం. కోటిపల్లి అభివృద్ధికి కోటి హామీ చినంచల సర్పంచ్ అభ్యర్థిగా పినకాన ముకుంద రావును ఆదరించండి. శేఖరాపురంలో టీడీపీలోకి 50 కుటుంబాలు అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్

పలాసలో మాక్ కౌన్సిల్ సమావేశం. వైస్ చైర్మన్ ఎంపికపై ఎమ్మెల్యే గౌతు శిరీష, వెంకన్న చౌదరి దిశానిర్దేశం.

Select Suryaa Now
పలాసలో మాక్ కౌన్సిల్ సమావేశం.  వైస్ చైర్మన్ ఎంపికపై ఎమ్మెల్యే గౌతు శిరీష, వెంకన్న చౌదరి దిశానిర్దేశం.

సమన్వయం, సమష్టి నిర్ణయాలతో ముందుకు సాగాలని కౌన్సిలర్లకు సూచనలు.

పలాస, మేజర్ న్యూస్: పలాస–కాశీబుగ్గ పురపాలక సంఘంలో నూతన పాలకవర్గం ఏర్పాటు నేపథ్యంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్‌పర్సన్ వజ్జ గంగాభవాని క్యాంపు కార్యాలయంలో ఆదివారం మాక్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష,నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి హాజరై తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లకు పలు కీలక సూచనలు, సలహాలు అందించారు.ఆదివారం ఉదయం జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం వైస్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ, అనుసరించాల్సిన విధివిధానాలు, పార్టీ పరంగా సమన్వయం తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. నూతనంగా ఎన్నికైన 31 మంది తెలుగుదేశం పార్టీ వార్డు కౌన్సిలర్లు ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నూతన పాలకవర్గం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని, పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. పార్టీ నాయకత్వం సూచనలకు అనుగుణంగా ఐక్యత, సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వజ్జ బాబూరావు,పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు బడ్డ నాగరాజు, సప్పన నవీన్, సీనియర్ నాయకులు లోడగల కామేష్, గాలి కృష్ణారావు, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, డొక్కరి శంకరరావు, గోళ్ళ చంద్రరావు, చెల్లూరి రామకృష్ణ, కొవ్వూరు సురేష్ తదితరులు పాల్గొన్నారు.