BREAKING
పలాసలో మాక్ కౌన్సిల్ సమావేశం. వైస్ చైర్మన్ ఎంపికపై ఎమ్మెల్యే గౌతు శిరీష, వెంకన్న చౌదరి దిశానిర్దేశం. వైద్య సేవలో ఆర్.ఎం.పి పి.ఎం.పి సేవల పాత్ర కీలకం ఏపీలో రేపు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక.. 66 స్థానాలకు కూటమి జాబితా విడుదల సామూహిక వేదపారాయణంతో మార్మోగిన సాయి సమితి ప్రాంగణం. కోటిపల్లి అభివృద్ధికి కోటి హామీ చినంచల సర్పంచ్ అభ్యర్థిగా పినకాన ముకుంద రావును ఆదరించండి. శేఖరాపురంలో టీడీపీలోకి 50 కుటుంబాలు అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్ రాచానుపల్లి కూటమి బలపరిచిన అభ్యర్థి నాగరాజు యాదవ్ జోరుగా ఎన్నికల ప్రచారం అక్రమ నిర్మాణాలను నిర్మూలించేది ఎప్పుడు..? నోటీసులు జారీ చేసినా ఆగని ఆక్రమణల పర్వం..! సేవా కార్యక్రమంతో సత్యసాయి బాబా శతజయంతి వేడుకల ముగింపు ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో అరాచక రాజకీయాల సృష్టించవద్దు - ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్ఈఆర్ పొన్నూరు మండలం ఆలూరు గ్రామ నివాసి అంబటి వెంకటేశ్వర్లు మృతి పార్టీకి తీరని లోటు........ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం కొడిమిలో వైసిపి నాయకులు ,కార్యకర్తలు విస్తృత ప్రచారం రెండో రోజు భారీగా నామినేషన్లు!

సామూహిక వేదపారాయణంతో మార్మోగిన సాయి సమితి ప్రాంగణం.

Select Suryaa Now
సామూహిక వేదపారాయణంతో మార్మోగిన సాయి సమితి ప్రాంగణం.

శతజయంతి ముగింపు ఉత్సవాల్లో భాగంగా పలాసలో వేదపారాయణం.

వేదపోషణ అందరి బాధ్యత - కన్వీనర్ తిరుమలరావు.

పలాస, మేజర్ న్యూస్ :  శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకల ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ సత్యసాయి సేవాసమితి పలాస వారి ఆధ్వర్యంలో సమితి ప్రాంగణంలో సామూహిక వేదపారాయణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఉదయం నుంచే సమితి ప్రాంగణం వేద మంత్రోచ్చారణలతో మార్మోగింది. వేదం గురువుగారి ఆధ్వర్యంలో భక్తులు సామూహికంగా వేదపారాయణం చేశారు.ఈ సందర్భంగా కన్వీనర్ ఇప్పిలి తిరుమలరావు మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు అనేక సందర్భాల్లో వేదపోషణ అందరి బాధ్యత అని చెప్పినట్లు గుర్తు చేశారు.వేదాలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదని,అవి ప్రతి ఇంట్లో, ప్రతి నోట పలకాలని బాబా ఆకాంక్షించారని అన్నారు. వేద మంత్రాల ఉచ్చారణ ద్వారా మనసుకు ప్రశాంతత, సమాజానికి శ్రేయస్సు కలుగుతుందని తెలిపారు.వేదాలను కాపాడుకోవడం, వాటిని తరువాతి తరాలకు అందించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని ఆయన పిలుపునిచ్చారు. శతజయంతి సందర్భంగా వేదపారాయణం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో వేదం గురువుగారు, మద్ది కామేశ్వరరావు, తాళాసు సూర్యప్రకాశ్, శ్రీ సత్యసాయి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ మల్లా రామేశ్వరరావు, తర్లాన రమేష్ తో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేద మంత్రాలను పారాయణం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివరిలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్ ఇప్పిలి తిరుమలరావు, వేదం గురువుగారు, మద్ది కామేశ్వరరావు, తాళాసు సూర్యప్రకాశ్, మల్లా రామేశ్వరరావు, తర్లాన రమేష్ తదితరులు పాల్గొన్నారు.