BREAKING
పలాసలో మాక్ కౌన్సిల్ సమావేశం. వైస్ చైర్మన్ ఎంపికపై ఎమ్మెల్యే గౌతు శిరీష, వెంకన్న చౌదరి దిశానిర్దేశం. వైద్య సేవలో ఆర్.ఎం.పి పి.ఎం.పి సేవల పాత్ర కీలకం ఏపీలో రేపు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక.. 66 స్థానాలకు కూటమి జాబితా విడుదల సామూహిక వేదపారాయణంతో మార్మోగిన సాయి సమితి ప్రాంగణం. కోటిపల్లి అభివృద్ధికి కోటి హామీ చినంచల సర్పంచ్ అభ్యర్థిగా పినకాన ముకుంద రావును ఆదరించండి. శేఖరాపురంలో టీడీపీలోకి 50 కుటుంబాలు అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్ రాచానుపల్లి కూటమి బలపరిచిన అభ్యర్థి నాగరాజు యాదవ్ జోరుగా ఎన్నికల ప్రచారం అక్రమ నిర్మాణాలను నిర్మూలించేది ఎప్పుడు..? నోటీసులు జారీ చేసినా ఆగని ఆక్రమణల పర్వం..! సేవా కార్యక్రమంతో సత్యసాయి బాబా శతజయంతి వేడుకల ముగింపు ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో అరాచక రాజకీయాల సృష్టించవద్దు - ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్ఈఆర్ పొన్నూరు మండలం ఆలూరు గ్రామ నివాసి అంబటి వెంకటేశ్వర్లు మృతి పార్టీకి తీరని లోటు........ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం కొడిమిలో వైసిపి నాయకులు ,కార్యకర్తలు విస్తృత ప్రచారం రెండో రోజు భారీగా నామినేషన్లు!

చినంచల సర్పంచ్ అభ్యర్థిగా పినకాన ముకుంద రావును ఆదరించండి.

Select Suryaa Now
చినంచల సర్పంచ్ అభ్యర్థిగా పినకాన ముకుంద రావును ఆదరించండి.

నాలుగు గ్రామాలకు ఒక్కటే మేనిఫెస్టో..

ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడమే లక్ష్యం.

గ్రామ పెద్దలు, యువత ఆలోచనల నుంచి వచ్చిన పనులకే ప్రాధాన్యం.

పలాస, నవంబరు 22,మేజర్ న్యూస్.

పలాస మండలం,చినంచల పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైయస్సార్సీపి బలపరిచిన పినకాన ముకుంద రావు తన మేనిఫెస్టోను విడుదల చేశారు. నాలుగు గ్రామాల పెద్దలు, యువత ఆలోచనల నుంచి వచ్చిన పనులను పూర్తి చేసి పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రకటించారు.పలాస రూరల్ మండలం చినంచల, రాజగోపాలపురం, వీర రామచంద్రపురం, గోదావరి పురం గ్రామాల్లో ఆదివారం వైసిపి జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధన రావు, మాజీ సర్పంచ్ కంచరాన భాస్కరరావు, మాజీ ఎంపీటీసీ పొట్నూరు జోగారావు, పలాస పట్టణ అధ్యక్షులు శిష్టు గోపి తదితర నేతలతో కలిసి నిర్వహించిన రోడ్ షో, ఇంటింటి ప్రచారంలో గ్రామస్తులు ముకుందకు పూలమాలలు వేసి, హారతులు పట్టి నీరాజనాలు పట్టారని, కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బమ్మిడి కోరారని, అనంతరం ముకుంద మేనిఫెస్టో విడుదల చేశారని, ఉమ్మడి ప్రణాళికలో నాలుగు గ్రామాల చెరువుల అభివృద్ధి చేసి పార్క్ గా తీర్చిదిద్దడం, ఆలయాల అభివృద్ధి, ప్రతి నెల నాలుగు గ్రామాల్లో గ్రామసభలు, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి, యువత కోసం క్రీడా మైదానం, చెరువుల నుంచి పొలాలకు నీరు చేరేలా పిల్ల కాలువలు వెడల్పు చేయడం, చినంచలలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం, రైతులకు బోర్ ఏర్పాటు చేసి నీటి సౌకర్యం కల్పించడం,రహదారి సౌకర్యం, సంతోష మాత ఆలయం నుండి గడ్డ వరకు సిసి రోడ్డు, శివాలయం వద్ద అంగన్ వాడీ నూతన భవనం, కోనేటి సుందరీకరణ, రాజగోపాలపురంలో పాత పంచాయతీ చెరువు శుభ్రత, మొక్కలు నాటడం, ప్రతి వీధిలో కొత్త డ్రైనేజీ, ఇంటింటికి తాగునీటి కొళాయి, శ్మశానవాటిక శుభ్రత, నీటి సదుపాయం, శ్మశాన రోడ్డు, వీర రామచంద్రపురంలో ప్రధాన వీధుల్లో సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ, గోపీవాడ చెరువు వరకు సిమెంట్ రోడ్డు, గుడిగుడ్ల మెట్టు నుండి సిసి రోడ్డు, కోనేరు చుట్టూ అభివృద్ధి, గోదావరి పురంలో సిసి కెమెరాలు, పంచాయతీ కార్యాలయం, చెరువు సుందరీకరణ, అదనంగా ప్రైమరీ హెల్త్ సెంటర్, గడ్డపై బ్రిడ్జి, నూతన స్కూల్ భవనం, కరువుతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందే వరకు పోరాటం అనే అంశాలు ఉన్నాయని, కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు.