BREAKING
పలాసలో మాక్ కౌన్సిల్ సమావేశం. వైస్ చైర్మన్ ఎంపికపై ఎమ్మెల్యే గౌతు శిరీష, వెంకన్న చౌదరి దిశానిర్దేశం. వైద్య సేవలో ఆర్.ఎం.పి పి.ఎం.పి సేవల పాత్ర కీలకం ఏపీలో రేపు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక.. 66 స్థానాలకు కూటమి జాబితా విడుదల సామూహిక వేదపారాయణంతో మార్మోగిన సాయి సమితి ప్రాంగణం. కోటిపల్లి అభివృద్ధికి కోటి హామీ చినంచల సర్పంచ్ అభ్యర్థిగా పినకాన ముకుంద రావును ఆదరించండి. శేఖరాపురంలో టీడీపీలోకి 50 కుటుంబాలు అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్ రాచానుపల్లి కూటమి బలపరిచిన అభ్యర్థి నాగరాజు యాదవ్ జోరుగా ఎన్నికల ప్రచారం అక్రమ నిర్మాణాలను నిర్మూలించేది ఎప్పుడు..? నోటీసులు జారీ చేసినా ఆగని ఆక్రమణల పర్వం..! సేవా కార్యక్రమంతో సత్యసాయి బాబా శతజయంతి వేడుకల ముగింపు ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో అరాచక రాజకీయాల సృష్టించవద్దు - ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్ఈఆర్ పొన్నూరు మండలం ఆలూరు గ్రామ నివాసి అంబటి వెంకటేశ్వర్లు మృతి పార్టీకి తీరని లోటు........ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం కొడిమిలో వైసిపి నాయకులు ,కార్యకర్తలు విస్తృత ప్రచారం రెండో రోజు భారీగా నామినేషన్లు!

శేఖరాపురంలో టీడీపీలోకి 50 కుటుంబాలు

Select Suryaa Now
శేఖరాపురంలో టీడీపీలోకి 50 కుటుంబాలు

ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సమక్షంలో పార్టీలో చేరిక
మెలియాపుట్టి. మేజర్ న్యూస్ : మెలియాపుట్టి మండలంలోని శేఖరాపురం గ్రామపంచాయతీ పరిధిలో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరింది. గ్రామానికి చెందిన 50 కుటుంబాల సభ్యులు ఆదివారం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సమక్షంలో టీడీపీలో చేరారు. గోక వనజాక్షి, గోక మోహనరావు ఆధ్వర్యంలో బుసకల వీరస్వామి, కోర్నాన హరీష్, పేర ఇంద్రుడు, పాపయ్య, అక్కురాడ భీముడు, పొన్నాడ నారాయణ తదితరులు పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పార్టీలో చేరిన వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంపై విశ్వాసంతో పెద్ద సంఖ్యలో కుటుంబాలు టీడీపీలో చేరడం సంతోషకరమన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సమన్వయంతో కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు నంబాల వెంకటరావు, జెడ్పీటీసీ ప్రతినిధి బమ్మిడి భాస్కరరావు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.