సర్పంచ్ గా ఆదరించండి.. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా
- ఎన్నికల ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థి బిల్లా నాగరాజు పంచాయతీ ప్రజలకు విజ్ఞప్తి
అనంతపురము రూరల్ మేజర్ న్యూస్ : రాచానుపల్లి పంచాయతీ సర్పంచ్ గా ప్రజలు ఆశీర్వదించి ఒక్కసారి అవకాశం ఇస్తే.. పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బిల్లా నాగరాజు తెలిపారు. కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బిల్లా నాగరాజు గెలుపు కోసం టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆదివారం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు కేటాయించిన కత్తెర గుర్తుకు, వార్డు సభ్యుల గుర్తులకు ఓటు వేసి గెలిపించాలని.. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అభ్యర్థి బిల్లా నాగరాజు గత రెండున్నర సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మరో రెండున్నర సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని గ్రామ అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారానే.. ప్రభుత్వ, ఎమ్మెల్యేల సహకారంతో.. నిధులను రాబట్టుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజలందరూ ఆలోచించి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.