BREAKING
జిల్లాస్థాయి నవోదయ మోడల్ పరీక్షలో సనపల అనన్యకు ప్రథమ స్థానం 24న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం..పౌర్ణమి గరుడ సేవ రద్దు అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఆదరించండి వైసిపి ఉనికి కోల్పోతుంది కరగాం సర్పంచ్ అభ్యర్థిగా పంగ కృష్ణవేణి నామినేషన్ కిమ్స్ ఆస్పత్రిలో సిబ్బందికి క్రీడోత్సవాలు రణస్థలం మండల ప్రజా పరిషత్ రాష్ట్రస్థాయి కరాటిపుటీల్లో కాంస్య పతకం పొన్నూరు పట్టణం 29వ వార్డులో వైసీపీ అభ్యర్థి గేరా కుమారి ముమ్మర ప్రచారం పెదంచల గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పీరికట్ల అంజి ఏకగ్రీవ ఎన్నిక. కేబీసీ 18 వివాదం: అమితాబ్ బచ్చన్, సోనీ టీవీకి లీగల్ నోటీసులు రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి. పిసినికాడ జాతీయ రహదారిపై ప్రమాదం. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తా రాజమహేంద్రవరం అభివృద్ధికి త్రిబుల్ ఇంజన్ సర్కార్ అవసరం పలాసలో మాక్ కౌన్సిల్ సమావేశం. వైస్ చైర్మన్ ఎంపికపై ఎమ్మెల్యే గౌతు శిరీష, వెంకన్న చౌదరి దిశానిర్దేశం.

రాజమహేంద్రవరం అభివృద్ధికి త్రిబుల్ ఇంజన్ సర్కార్ అవసరం

Select Suryaa Now
రాజమహేంద్రవరం అభివృద్ధికి త్రిబుల్ ఇంజన్ సర్కార్ అవసరం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరాజమండ్రి నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి నగరపాలక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కోరారు. 2024లో ప్రజలు డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి పట్టం కట్టారని, ప్రధాని మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంతో పాటు స్థానిక సంస్థల్లోనూ కూటమి గెలిస్తే ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రాజమండ్రి అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో ట్రాఫిక్, డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవి, 29వ వార్డు అభ్యర్థి బాలమురళీకృష్ణను గెలిపించాలని కోరారు. ఈ నెల 26న గులాబీ రంగు స్లిప్‌లో ఐదో నంబరులో ఉన్న మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవికి, రెండో స్లిప్‌లో మొదటి నంబరులో ఉన్న బాలమురళీకృష్ణకు ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని పురంధేశ్వరి పిలుపునిచ్చారు.