BREAKING
ఒకే రోజున హరిహరుల పూజ.. వైకుంఠ చతుర్దశి వెనుక ఉన్న అద్భుత పురాణ గాథ ఇదే.. సర్పంచ్ అభ్యర్థులకు మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు ఒకే రోజున హరిహరుల పూజ.. వైకుంఠ చతుర్దశి వెనుక ఉన్న అద్భుత పురాణ గాథ ఇదే.. జగన్నాధపురం సర్పంచ్ అభ్యర్థిగా కెళ్ళి లక్ష్మి నామినేషన్ దాఖలు అనకాపల్లి జిల్లా మరియు ఛార్జ్ స్థాయి జనగణన శిక్షణా కార్యక్రమం ప్రారంభం జాలంపల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పులవర్తి సూర్యప్రకాశరావు నామినేషన్ దాఖలు కురవంక సర్పంచ్ స్థానానికి పసుపులేటి పార్వతమ్మ నామినేషన్ : అభివృద్ధిని చూసి మరో అవకాశం ఇవ్వండి : ప్రజలకు మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి విజ్ఞప్తి పి ఆర్ టి యు ఆధ్వర్యంలో నవోదయ మోడల్ ఎంట్రెన్స్ టెస్ట్ మీ ఓటుతో మల్లేశ్వరిని గెలిపించండి స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆశీస్సులు అందుకున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్ పృధ్వి మణికంఠ నకిలీ, నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్ల పై ఉక్కుపాదం. కోళ్లబైలు,వైఎస్సార్ కాలనీ టిడిపి సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు : హాజరైన కోళ్లబైలు ఇంచార్జ్ శ్రీనివాసులు నాయుడు,ఎంపిపి గురునాథ్ యాదవ్ : పెద్దసంఖ్యలో తరలివచ్చిన కూటమి నాయకులు చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ గా గోపీనాథ్ కొత్తకోట కూటమి అభ్యర్థి పాకలపాటి సునీతకు మద్దతుగా ప్రచారం ప్రజా సేవకు వయసుతో పనిలేదు ఓటర్లు లో అభిమానంతో గెలుపు సాధిస్తా.

కోళ్లబైలు,వైఎస్సార్ కాలనీ టిడిపి సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు : హాజరైన కోళ్లబైలు ఇంచార్జ్ శ్రీనివాసులు నాయుడు,ఎంపిపి గురునాథ్ యాదవ్ : పెద్దసంఖ్యలో తరలివచ్చిన కూటమి నాయకులు

Select Suryaa Now
కోళ్లబైలు,వైఎస్సార్ కాలనీ టిడిపి సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు : హాజరైన కోళ్లబైలు ఇంచార్జ్ శ్రీనివాసులు నాయుడు,ఎంపిపి గురునాథ్ యాదవ్ : పెద్దసంఖ్యలో తరలివచ్చిన కూటమి నాయకులు

 

మదనపల్లి,మేజర్ న్యూస్ : కూటమి బలపరిచిన కోళ్లబైలు టిడిపి సర్పంచ్ అభ్యర్థిని ఇర్రి అరుణమ్మ,వైఎస్సార్ కాలనీ టిడిపి అభ్యర్థి చిన్నకోట్ల జయరాంలు ఆదివారం అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు.వైఎస్సార్ కాలనీ సచివాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ కార్యక్రమానికి కోళ్లబైలు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ రాటకొండ శ్రీనివాసులు నాయుడు,ఎంపిపి బీదం గురునాథ్ యాదవ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతున్నాయని,ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మంత్రి లోకేష్ బాబు సారధ్యంలో ఏపీ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందన్నారు.ఇక మదనపల్లి నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోళ్లబైలు అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని,సిసి రోడ్లు,ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రూ.9 కోట్లు నిధులు మంజూరు చేశారని కొనియాడారు.దీనిని దృష్టిలో ఉంచుకొని కోళ్లబైలు,వైఎస్సార్ కాలనీలలో టిడిపి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఇటీవల జరిగిన మునిసిపల్,ఎంపిటిసి,జెడ్పిటిసి ఎన్నికలలో కూటమి ప్రభంజనం సృష్టించిందని,అదే స్ఫూర్తితో సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కోళ్లబైలు ఎంపిటిసి మోహన్ రెడ్డి,వైఎస్సార్ కాలనీ ఎంపిటిసి కమ్మల అనురాధ,టిడిపి నాయకులు రమేష్ రెడ్డి,శ్రీనాథ్,ఈశ్వర్ నాయుడు,రవి పెద్దఎత్తున కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి