మీ ఓటుతో మల్లేశ్వరిని గెలిపించండి
- వగ్గంపల్లిలో బైరెడ్డి జయరామిరెడ్డి ఎన్నికల ప్రచారం
పామూరు, మేజర్ న్యూస్ : మండలంలోని వగ్గంపల్లి పంచాయతీ అభివృద్ధికి ప్రజలంతా సమష్టిగా ముందుకు రావాలని పామూరు మండల సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు బైరెడ్డి జయరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం వగ్గంపల్లి గ్రామంలో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బైరెడ్డి మల్లేశ్వరికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఓటర్లను కలిసి మల్లేశ్వరికి మద్దతు తెలపాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 26న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో మంచం గుర్తుపై ఓటు వేసి బైరెడ్డి మల్లేశ్వరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజల సమస్యలపై అవగాహనతో అభివృద్ధి పట్ల నిబద్ధతతో పనిచేసే నాయకత్వానికి అవకాశం కల్పించాలని కోరారు. మల్లేశ్వరిని గెలిపించడం ద్వారా వగ్గంపల్లి పంచాయతీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని జయరామిరెడ్డి అభ్యర్థించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బైరెడ్డి వెంకటేశ్వర్లు (తుఫాన్ రెడ్డి), బైరెడ్డి రమణారెడ్డి,ఎలికా నారాయణ, బైరెడ్డి సుధాకర్ రెడ్డి, బైరెడ్డి సురేంద్ర, గంగిరెడ్డి వెంకటరెడ్డి, షేక్ సుభాని, రాజారావు, ముక్కు తిరుపతయ్య, తమ్మినేని పుల్లయ్య, దేవన బోయిన నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.