కార్తీక మాసం ఫణిగిరి ప్రదక్షిణకు రెండు లక్షల మంది పైగా భక్తుల రాక!
24న పంచదార్లలో ఆధ్యాత్మిక సందడి.. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా తరలిరాక?
అచ్యుతాపురం, మేజర్ న్యూస్ : భక్తిభావం వెల్లివిరియనుంది.. శివనా మస్మరణతో ఫణిగిరి మారు మోగనుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్లలో కొలువుదీరిన శ్రీ ఉమాధర్మలింగే శ్వరస్వామి పుణ్యక్షేత్రంలో ఈ నెల 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా ఫణిగిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహత్తర ఆధ్యాత్మిక వేడుకకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రెండు లక్ష మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. పంచదార్లలోని ఐదు పవిత్ర జలధారలకు ప్రత్యేకత ఉంది. వీటిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకోవడం భక్తుల విశ్వనాధ
సుమారు 32 కిలోమీటర్ల మేర సాగే ప్రదక్షిణ పంచదార్ల ధారభోగాపురం, వెంకటాపురం, గొర్లెధర్మ వరం, వెదురువాడ, అచ్యుతాపురం, చోడపల్లి, కొండకర్ల, ఎర్రవరం, ఉప్పవరం, మల్లవరం, నరేంద్రపురం, చెర్లోపాలెం, మడకపాలెం, మూలజంప, గోకివాడ, కొత్తూరు మీదుగా సాగనుంది. తెల్లవారు జామున 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రదక్షిణ సాయంత్రం 6 గంటలకు జరగనున్నది. భక్తులు నడకన భజనలు, శివనామస్మరణలతో సాగే ఈపుణ్య యాత్రకు భక్తులు పెద్దఎత్తున సిద్ధమవుతున్నారు.