BREAKING
పి ఆర్ టి యు ఆధ్వర్యంలో నవోదయ మోడల్ ఎంట్రెన్స్ టెస్ట్ మీ ఓటుతో మల్లేశ్వరిని గెలిపించండి స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆశీస్సులు అందుకున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్ పృధ్వి మణికంఠ నకిలీ, నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్ల పై ఉక్కుపాదం. కోళ్లబైలు,వైఎస్సార్ కాలనీ టిడిపి సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు : హాజరైన కోళ్లబైలు ఇంచార్జ్ శ్రీనివాసులు నాయుడు,ఎంపిపి గురునాథ్ యాదవ్ : పెద్దసంఖ్యలో తరలివచ్చిన కూటమి నాయకులు చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ గా గోపీనాథ్ కొత్తకోట కూటమి అభ్యర్థి పాకలపాటి సునీతకు మద్దతుగా ప్రచారం ప్రజా సేవకు వయసుతో పనిలేదు ఓటర్లు లో అభిమానంతో గెలుపు సాధిస్తా. వెల్దుర్తి మండలంలో జోరుగా నామినేషన్ల పర్వం రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 83, వార్డు సభ్యులకు 234 దాఖలు మిట్స్‌ యూనివర్శిటీలో ఘనంగా ఎన్‌సీసీ దినోత్సవ వేడుకలు : హాజరైన ఎన్‌సీసీ కేర్‌టేకింగ్ ఆఫీసర్ డాక్టర్ చరణ్ కూచి కొమీర పంచాయతీలో కూటమి ధర్మానికి విరుద్ధంగా టిడిపి నామినేషన్ --- మండల బిజెపి అధ్యక్షుడు చిన్న శెట్టిపాలెం సర్పంచ్ పదవి ఏకగ్రీవం జాలంపల్లి వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా బోరా లక్ష్మి నామినేషన్ దాఖలు ఇద్దరు వార్డు మెంబర్లు బిజెపి. తీర్థం కార్తీక మాసం ఫణిగిరి ప్రదక్షిణకు రెండు లక్షల మంది పైగా భక్తుల రాక!

జాలంపల్లి వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా బోరా లక్ష్మి నామినేషన్ దాఖలు

Select Suryaa Now
జాలంపల్లి వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా బోరా లక్ష్మి నామినేషన్ దాఖలు

తప్పెటగుళ్లు, కోలాటాల జన సమూహంతో నడుమ జేడీపేటలో వైభవంగా నామినేషన్ కార్యక్రమం

ఒక్క అవకాశం ఇస్తే పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ

 వి మాడుగుల, మేజర్ న్యూస్ : వి  మాడుగుల మండలం జాలంపల్లి పంచాయతీ వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా బోరా లక్ష్మి ఆదివారం భారీ ర్యాలీగా జనసమూహం తో వైభవంగా నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతోపాటు పది వార్డులు మెంబర్స్ నామినేషన్ దాఖలు చేశారు మాజీ డిప్యూటీ సీఎం  బూడి ముత్యాల నాయుడు బలపరిచిన అభ్యర్థిగా ఆమె ఎన్నికల బరిలోకి దిగారు.తన అనుచరులు, గ్రామస్థులతో కలిసి తప్పిడి గుళ్ళు, కోలాటాల నడుమ  ర్యాలీగా వెళ్లి జేడీపేటలోని ఎన్నికల కేంద్రంలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా బోరా లక్ష్మి మాట్లాడుతూ.. సర్పంచ్‌గా తనకు ఒక్క అవకాశం ఇస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ జాలంపల్లి పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో ప్రధాన సమస్యలైన డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాల ఏర్పాటుతో పాటు నిరంతరం వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తానని  రైతులకు ఉపయోగపడే అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.ఈ కార్యక్రమంలో జాలంపల్లి మాజీ సర్పంచ్ గనుతూరి దారా మల్లేశ్వరి, చిన్ని బాణం శ్రీనివాస్ దొర  మాస్టర్, కోన అప్పారావు,  బోరా అప్పలనాయుడు, గండం వెంకటరమణ, గొర్లి అప్పలనాయుడు, చల్లా సూరిబాబు, బోడి నానాజీ, సోములు అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు చుట్టుపక్కల 14 గ్రామాల నుండి ఆమె అభిమానులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, మహిళలు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.