కొమీర పంచాయతీలో కూటమి ధర్మానికి విరుద్ధంగా టిడిపి నామినేషన్ --- మండల బిజెపి అధ్యక్షుడు చిన్న
రావికమతం మేజర్ న్యూస్: మండలంలో కొమ్మిరి సర్పంచ్ ఎన్నికలలో కూటమి ధర్మానికి విరుద్ధంగా టిడిపి నామినేషన్లు దాఖలు చేశారని మండల బిజెపి అధ్యక్షుడు గూటాల చిన్న మండిపడ్డారు. ఆదివారం ఆయన నేటి దినపత్రిక సూర్యతో మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు మండలంలో 28 పంచాయతీలకు గాను కోమీర పంచాయతీ తమ పార్టీకి కేటాయించాలని చోడవరం ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజుకు లిఖితపూర్వకంగా కోరమన్నారు. ఎమ్మెల్యే తమ విజ్ఞప్తిని సానుకూలంగా స్పందించారన్నారు. దీంతో బిజెపి పార్టీ నుంచి గొంతిన అమ్మాజీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ తో ఆటో ఆరు వార్డు మెంబర్లకు నామినేషన్ వేసామన్నారు. కూటమి ధర్మాన్ని విస్మరించి టిడిపి 8 వార్డులలోను సర్పంచ్ అభ్యర్థిగా గొర్లె రమణమ్మ చే నామినేషన్ వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగిన ఒక పంచాయతీ కూడా తమ పార్టీకి కేటాయించకపోవడంపై భవిష్యత్తు ప్రణాళికపై జిల్లా నాయకత్వం తో చర్చలు జరుపుతామన్నారు.