BREAKING
పి ఆర్ టి యు ఆధ్వర్యంలో నవోదయ మోడల్ ఎంట్రెన్స్ టెస్ట్ మీ ఓటుతో మల్లేశ్వరిని గెలిపించండి స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆశీస్సులు అందుకున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్ పృధ్వి మణికంఠ నకిలీ, నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్ల పై ఉక్కుపాదం. కోళ్లబైలు,వైఎస్సార్ కాలనీ టిడిపి సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు : హాజరైన కోళ్లబైలు ఇంచార్జ్ శ్రీనివాసులు నాయుడు,ఎంపిపి గురునాథ్ యాదవ్ : పెద్దసంఖ్యలో తరలివచ్చిన కూటమి నాయకులు చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ గా గోపీనాథ్ కొత్తకోట కూటమి అభ్యర్థి పాకలపాటి సునీతకు మద్దతుగా ప్రచారం ప్రజా సేవకు వయసుతో పనిలేదు ఓటర్లు లో అభిమానంతో గెలుపు సాధిస్తా. వెల్దుర్తి మండలంలో జోరుగా నామినేషన్ల పర్వం రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 83, వార్డు సభ్యులకు 234 దాఖలు మిట్స్‌ యూనివర్శిటీలో ఘనంగా ఎన్‌సీసీ దినోత్సవ వేడుకలు : హాజరైన ఎన్‌సీసీ కేర్‌టేకింగ్ ఆఫీసర్ డాక్టర్ చరణ్ కూచి కొమీర పంచాయతీలో కూటమి ధర్మానికి విరుద్ధంగా టిడిపి నామినేషన్ --- మండల బిజెపి అధ్యక్షుడు చిన్న శెట్టిపాలెం సర్పంచ్ పదవి ఏకగ్రీవం జాలంపల్లి వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా బోరా లక్ష్మి నామినేషన్ దాఖలు ఇద్దరు వార్డు మెంబర్లు బిజెపి. తీర్థం కార్తీక మాసం ఫణిగిరి ప్రదక్షిణకు రెండు లక్షల మంది పైగా భక్తుల రాక!

మిట్స్‌ యూనివర్శిటీలో ఘనంగా ఎన్‌సీసీ దినోత్సవ వేడుకలు : హాజరైన ఎన్‌సీసీ కేర్‌టేకింగ్ ఆఫీసర్ డాక్టర్ చరణ్ కూచి

Select Suryaa Now
మిట్స్‌ యూనివర్శిటీలో ఘనంగా ఎన్‌సీసీ దినోత్సవ వేడుకలు : హాజరైన ఎన్‌సీసీ కేర్‌టేకింగ్ ఆఫీసర్ డాక్టర్ చరణ్ కూచి

 

కురబలకోట,మేజర్ న్యూస్ : మదనపల్లి సమీపంలో గల (మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఎన్‌సీసీ దినోత్సవాన్ని ఆదివారం ఆర్మీ వింగ్,ఎయిర్ వింగ్ ఎన్‌సీసీ క్యాడెట్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ కేర్‌టేకింగ్ ఆఫీసర్ డాక్టర్ చరణ్ కూచి మాట్లాడుతూ ఎన్‌సీసీ అనేది కేవలం ఒక శిక్షణా కార్యక్రమం మాత్రమే కాకుండా విద్యార్థుల్లో క్రమశిక్షణ,నాయకత్వ లక్షణాలు,ఆత్మవిశ్వాసం,సమయపాలన,దేశభక్తి వంటి ఉన్నత విలువలను పెంపొందించే గొప్ప వేదిక అని అన్నారు.ఎన్‌సీసీ శిక్షణ ద్వారా విద్యార్థులు శారీరకంగా,మానసికంగా దృఢంగా తయారవడంతోపాటు,ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పొందుతారని తెలిపారు.క్యాంపుల్లో పాల్గొనడం,వివిధ పోటీల్లో ప్రతిభ కనబరచడం ద్వారా విద్యార్థులకు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు లభిస్తాయని తెలిపారు.ముఖ్యంగా థాల్ సైనిక్ క్యాంప్,వాయు సైనిక్ క్యాంప్ వంటి జాతీయ స్థాయి శిబిరాల్లో పాల్గొనడం ప్రతి క్యాడెట్‌కు గర్వకారణమన్నారు.సీనియర్ క్యాడెట్లు సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకొని జూనియర్ క్యాడెట్లు కూడా కష్టపడి ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.భారత సాయుధ దళాల్లో అధికారులుగా చేరాలనే ఆసక్తి కలిగిన విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బి) పరీక్షకు అవసరమైన అవగాహన,వ్యక్తిత్వ వికాసం,కమ్యూనికేషన్ నైపుణ్యాలు,నిర్ణయాత్మక సామర్థ్యం,నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని తెలిపారు.దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ప్రతి క్యాడెట్ బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదగాలని తెలిపారు.ఈ సందర్భంగా తిరుపతి గ్రూప్ స్థాయి,ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డైరెక్టరేట్ స్థాయిలలో వివిధ ఎన్‌సీసీ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన మిట్స్ యూనివర్సిటీ క్యాడెట్లను అభినందించారు.ముఖ్యంగా జాతీయ స్థాయిలో నిర్వహించిన థాల్ సైనిక్ క్యాంప్ (టిసిఎస్),వాయు సైనిక్ క్యాంప్ (వి.ఎస్.సి) వంటి ప్రతిష్ఠాత్మక శిక్షణ శిబిరాల్లో పాల్గొని విజయాలు సాధించిన క్యాడెట్లను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ కేర్‌టేకింగ్ ఆఫీసర్ డాక్టర్ చరణ్ కూచి అసోసియేట్ డీన్ (ఆర్ అండ్ డి) డాక్టర్ పి.శివయ్య,భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ బి.జగదీష్ బాబు,ఆర్మీ వింగ్,ఎయిర్ వింగ్ ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి