అంకిశెట్టిపల్లె వైకాపా సర్పంచ్ అభ్యర్థిగా మోపూరి రెడ్డిశేఖర్ నామినేషన్ : హాజరైన పార్టీ నాయకులు,కార్యకర్తలు
మదనపల్లి రూరల్,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా,మదనపల్లి నియోజకవర్గం,అంకిశెట్టిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మోపురి రెడ్డి శేఖర్ ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు.ఆదివారం అంకిశెట్టిపల్లి సచివాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పార్టీ ముఖ్యనాయకులు,కార్యకర్తలు,గ్రామపెద్దల సమక్షంలో ఆయన తన నామినేషన్ పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా రెడ్డిశేఖర్ మాట్లాడుతూ తనకు ప్రజలు ఒక అవకాశం ఇస్తే పంచాయతీ అభివృద్ధి,ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని,అంకిశెట్టి గ్రామపంచాయతీని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు.మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని,మళ్లీ ప్రజలకు మంచి జరగాలంటే వైఎస్ఆర్సిపిని ఆదరించాలని కోరారు.గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శరత్ రెడ్డి,యువనాయకులు రెడ్డి ప్రసాద్,స్థానిక వైకాపా నాయకులు,వార్డు సభ్యుల అభ్యర్థులు,కార్యకర్తలు,గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొని ఆయనకు మద్ధతు తెలిపారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి