BREAKING
వెల్దుర్తి మండలంలో జోరుగా నామినేషన్ల పర్వం రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 83, వార్డు సభ్యులకు 234 దాఖలు మిట్స్‌ యూనివర్శిటీలో ఘనంగా ఎన్‌సీసీ దినోత్సవ వేడుకలు : హాజరైన ఎన్‌సీసీ కేర్‌టేకింగ్ ఆఫీసర్ డాక్టర్ చరణ్ కూచి కొమీర పంచాయతీలో కూటమి ధర్మానికి విరుద్ధంగా టిడిపి నామినేషన్ --- మండల బిజెపి అధ్యక్షుడు చిన్న శెట్టిపాలెం సర్పంచ్ పదవి ఏకగ్రీవం జాలంపల్లి వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా బోరా లక్ష్మి నామినేషన్ దాఖలు ఇద్దరు వార్డు మెంబర్లు బిజెపి. తీర్థం కార్తీక మాసం ఫణిగిరి ప్రదక్షిణకు రెండు లక్షల మంది పైగా భక్తుల రాక! శ్రీరామ్ చినబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి తరలిరండి : ఏఎంసి డైరెక్టర్,టిడిపి నేత సుబ్రహ్మణ్యం రెడ్డి పిలుపు రుషికొండ బీచ్‌లో విద్యార్థి గల్లంతు! జిల్లాలో 98 శాతం పల్స్ పోలియో పూర్తి అంకిశెట్టిపల్లె వైకాపా సర్పంచ్ అభ్యర్థిగా మోపూరి రెడ్డిశేఖర్ నామినేషన్ : హాజరైన పార్టీ నాయకులు,కార్యకర్తలు పెందుర్తిలో జేడీ ఫౌండేషన్‌ పొలంబడి కార్యక్రమం విశాఖ–తిరువణ్ణామలై ప్రత్యేక రైలును రెగ్యులర్‌ చేయాలి ములకలచెరువు ఎంపీపీ దొరస్వామి నాయుడుకి టిడిపి నేతల సత్కారం : హాజరైన పచ్చిపాల రామకృష్ణ ఆచారి,పఠాన్ ఖాదర్ ఖాన్ వేంపల్లి టిడిపి సర్పంచ్ అభ్యర్థినిగా బైగారి భారతి నాయుడు నామినేషన్ : శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు,కార్యకర్తలు

పెందుర్తిలో జేడీ ఫౌండేషన్‌ పొలంబడి కార్యక్రమం

Select Suryaa Now
పెందుర్తిలో జేడీ ఫౌండేషన్‌ పొలంబడి కార్యక్రమం

 

పెందుర్తి, (మేజర్‌ న్యూస్‌):

పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థినుల్లో వ్యవసాయంపై అవగాహన పెంపొందించేందుకు జేడీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం పెందుర్తిలో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహ ప్రాంగణంలో విద్యార్థినులతో వంగ, మిరప, టమోటా, క్యాబేజీ, కాలీఫ్లవర్‌ తదితర కూరగాయ మొక్కలతో పాటు పాలకూర, తోటకూర విత్తనాలను నాటించారు. మొక్కల పెంపకం, వాటి సంరక్షణపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రోటరీ క్లబ్‌ పోర్ట్‌సిటీ అధ్యక్షుడు ఎన్‌ఎస్‌ఎన్‌ రాజు మాట్లాడుతూ చిన్నతనం నుంచే విద్యార్థులకు మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. విశాఖ మహానగరంలో పెద్దఎత్తున మొక్కలు నాటడంతో పాటు వర్షపు నీటిని సంరక్షించే కార్యక్రమాలను త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వసతిగృహ సంక్షేమాధికారి సత్య, పీటీజీ మిద్దెతోటల నిర్వాహకురాలు పి.రేఖ, జేడీ ఫౌండేషన్‌ సభ్యులు, వసతిగృహ సిబ్బంది పాల్గొన్నారు.