వేంపల్లి టిడిపి సర్పంచ్ అభ్యర్థినిగా బైగారి భారతి నాయుడు నామినేషన్ : శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు,కార్యకర్తలు
మదనపల్లె,మేజర్ న్యూస్ : మదనపల్లి మండలం,వేంపల్లి పంచాయతీకి కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థినిగా బైగారి భారతి నాయుడు ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు.అంకిశెట్టిపల్లి గ్రామసచివాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఆమె సమర్పించారు.ఈ సందర్భంగా భారతి నాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సహకారంతో పంచాయతీని ఎంతో అభివృద్ధి చేశామని,మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు.నిస్వార్ధంగా ప్రజలకు సేవలందించడమే లక్ష్యమని,తనకు ఒక అవకాశం కల్పిస్తే వేంపల్లెను ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.తనకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా,కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి