BREAKING
విశాఖ–తిరువణ్ణామలై ప్రత్యేక రైలును రెగ్యులర్‌ చేయాలి ములకలచెరువు ఎంపీపీ దొరస్వామి నాయుడుకి టిడిపి నేతల సత్కారం : హాజరైన పచ్చిపాల రామకృష్ణ ఆచారి,పఠాన్ ఖాదర్ ఖాన్ వేంపల్లి టిడిపి సర్పంచ్ అభ్యర్థినిగా బైగారి భారతి నాయుడు నామినేషన్ : శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు,కార్యకర్తలు అమెజాన్ కంపెనీకి భూముల అప్పగింతపై గ్రామస్తుల అభ్యంతరం కొండచిలువను చంపకుండా బంధించిన రైతు.. నర్సింహులు ధైర్యసాహసాలకు అభినందనలు రాచవేటివారిపల్లి టిడిపి అభ్యర్థినిగా అరుణ కుమారి నామినేషన్ : హాజరైన సీనియర్ నాయకులు ఆర్.జె వెంకటేష్ పదవే లక్ష్యం కాదు.. పల్లె అభివృద్ధే ధ్యేయమంటూ.. పది హామీలు అమలు చేస్తా .. వైసీపీ తరఫున సోమందేపల్లి సర్పంచ్ స్థానానికి డిసి అశోక్ నామినేషన్ 33వ వార్డులో దద్దరిల్లిన వైఎస్ఆర్‌సీపీ ప్రచార భారీ ర్యాలీ పొన్నీటిపాళ్యం సర్పంచ్ బరిలో తిరుమలశెట్టి లావణ్య : నామినేషన్ దాఖలు చేసిన మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి కోడలు నవోదయ మోడల్ పరీక్షకు అపూర్వ ఆదరణ.. సోమందేపల్లి బిజెపి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎస్ఆర్ పార్థసారథి రెడ్డి సోమందేపల్లి పంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దుతాం.. కూటమి సర్పంచ్ అభ్యర్థి సిసి హరి నామినేషన్ దాఖలు కోటి ఓట్లు.. 90 సీట్లే మా టార్గెట్ *కుందుర్పి సర్పంచ్ బరిలో తండ్రి,కొడుకులు* పొన్నూరు 9 వ వార్డు లో జనసేన అభ్యర్థి ఆకుల. పద్మావతి గడపగడప విస్తృత ప్రచారం

కొండచిలువను చంపకుండా బంధించిన రైతు.. నర్సింహులు ధైర్యసాహసాలకు అభినందనలు

Select Suryaa Now
కొండచిలువను చంపకుండా బంధించిన రైతు.. నర్సింహులు ధైర్యసాహసాలకు అభినందనలు

దోమ, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా దోమ మండలం మైలారం గ్రామంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు బోయిని నర్సింహులు పశువుల కొట్టంలోకి కొండచిలువ ప్రవేశించడాన్ని గుర్తించారు. ఏమాత్రం భయపడకుండా, దానిని చంపకుండా ఎంతో ధైర్యసాహసాలతో పట్టుకుని తన వద్ద ఉన్న బోనులో బంధించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ హీర్యా నాయక్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువను చంపకుండా సురక్షితంగా బంధించిన రైతు నర్సింహులు ధైర్యసాహసాలను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం అటవీశాఖ సిబ్బంది కొండచిలువను తీసుకెళ్లి మహ్మదాబాద్ రిజర్వ్ ఫారెస్ట్‌లో సురక్షితంగా విడిచిపెట్టారు.ఈ సందర్భంగా ఎఫ్‌ఎస్‌ఓ హీర్యా నాయక్ మాట్లాడుతూ.. వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చినప్పుడు వాటిని చంపడం, గాయపరచడం చేయకుండా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కొండచిలువను సురక్షితంగా అటవీశాఖకు అప్పగించిన రైతు నర్సింహులు చూపిన సమయస్ఫూర్తి, సాహసాన్ని గ్రామస్థులు అభినందిస్తున్నారు.