పొన్నూరు 9 వ వార్డు లో జనసేన అభ్యర్థి ఆకుల. పద్మావతి గడపగడప విస్తృత ప్రచారం
పొన్నూరు మేజర్ న్యూస్:-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ దీవెనలతో పొన్నూరు పట్టణం 9వ వార్డు ఆలూరు కట్ట మరియు క్యాబిన్ పేట లో కూటమి నాయకుల సహకారంతో జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ( ఆకుల గోపి అమ్మ) ఆకుల.పద్మావతి ఎన్నికల ప్రచారంలో వార్డు ప్రజలతో మమేకమై ముందుకు సాగారు .వార్డులో గడపగడపకు తిరుగుతూ ప్రజలతో , కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వార్డు ప్రజలకు వివరించారు. వార్డులో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమ అమూల్యమైన ఓటును గ్లాసు గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు షేక్. మస్తాన్ వలి,గబ్బర్ సింగ్, బాజీ, జనసేన నాయకులు
యాలవర్తి వెంకటేశ్వర్లు రావు,సింగం శెట్టి సెంకర్ సుబ్బా రావు , ఎం. మరిదాస్ కూటమి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- సిలార్