BREAKING
నేడు మేయర్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్ ఎన్నిక సేవా దృక్పథం కలిగిన వ్యక్తి రమేష్ శెట్టి: బొమ్మన దశరథరామిరెడ్డి చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి..! గ్రామ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి *ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం* పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న పిచేర్యాగడి గ్రామ సర్పంచ్ అమృత వీరారెడ్డి బెల్టు షాపుపై పోలీసుల దాడి సమర్ధవంతమైన నాయకులను గెలిపించాలి: మజ్జి సిరి సహస్ర 41 రోజుల పాటు కఠిన నియమ నిష్ఠలతో అయ్యప్ప దీక్ష.. ఇరుముడితో శబరిమలకు పయనం పుష్కర ఘాట్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య సోదరులను రాజకీయంగా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు బీసీల రాజకీయ చైతన్యానికి ఎస్సీలుగా మా మద్దతు కాశపాగ ఇమ్మయ్య వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రజా ప్రతినిధులు బచ్చు ప్రభాకర్ నూతన గృహ భూమి పూజ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి.

ఖుర్ఆన్ కంఠస్థ పోటీలు.విజేతలకు బహుమతులు

Select Suryaa Now
 ఖుర్ఆన్ కంఠస్థ పోటీలు.విజేతలకు బహుమతులు

మార్కాపురం, మేజర్‌న్యూస్‌ :

మార్కాపురం జిల్లా.

యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్‌ & జమాఅతె ఇస్లామి హింద్ సంయుక్తంగా రాష్ర్టవ్యాప్త పన్నెండవ ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో భాగంగా ప్రకాశం జిల్లా క్వార్టర్ ఫైనల్ కార్యక్రమం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగింది.ఈ కార్యక్రమంలో  200 మంది విద్యార్థి,విద్యార్థినులు పాల్గొనగా మొదటి బహుమతులు  ఆరిఫ్  ఖాన్,ఆఫిఫ ఖాన్, అన్వర్ , రషీద్, అస్‌మ, శాకీర్,వలి లతో పాటు 30 మంది విజేతలకు  పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్  మహబూబ్ బాష, జామియా మసీద్ ప్రెసిడెంట్ సఫ్దార్ అలీబేగ్, మైనార్టీ సెల్ నాయకులు జాబిర్ హుస్సేన్  బేగ్, జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర సలహ మండలి సభ్యులు అష్రఫ్ అలీ బహుమతులు అందజేసారు.

ముఖ్య అతిధిగా విచ్చేసిన పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్  మహబూబ్ బాష మాట్లాడుతూ ఖుర్ఆన్ కంఠస్థ పోటీలు చిన్న పిల్లల్లో బాల్యం నుండే ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడానికి ఇదొక సువర్ణ అవకాశమని, సాంకేతిక పరికరాలైన మొబైల్ ఫోన్,ఇంటర్నెట్ ల దుర్వినియోగం వలన నైతిక విలువల పతనవుతున్న తరుణంలో పిల్లలలో నైతికత చిన్న వయసు నుండే ఖుర్ఆన్ తో సంబంధం ఏర్పరిస్తే భవిష్యత్తు లో ఒక గొప్ప ధార్మిక సమాజం ఉనికిలో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర సలహ మండలి సభ్యులు అష్రఫ్ అలీ మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా జమాఅతె ఇస్లామి హింద్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని దివ్య ఖుర్ఆన్ లో మానవుని అన్ని రంగాల యెక్క జీవన శైలి ఎలా ఉండాలో సృష్ట్రముగా తెలియ జేయటం జరిగిందని ,ఇది కేవలం ముస్లిం సమాజం కొరకు మాత్రమే కాదనీ యావత్ మానవాళి కోసం దివ్య ఖుర్ఆన్ అవతరించిందని తెలియజేశారు.
న్యాయ నిర్ణేతలుగా జనాబ్ హుస్న్ జమ, ముఫ్తీ మిన్హాజ్, రఫి, జె.ఐ.హెచ్ పట్టణ అధ్యక్షులు సికిందర్ బాష, ఎస్ ఐ ఓ నాయకులు ఆరాఫత్, ఖాలిద్ , ఐ వై యమ్ రాష్ట్ర కార్యదర్శి ఇస్మాయిల్, తలహా, జె.ఐ.హెచ్ ఫైనాన్స్ కార్యదర్శి మొహమ్మద్ ఖాన్, సభ్యులు నజీర్ ,కార్యకర్తలు  అయుాబ్ ఖాన్, ఖాసింబాష పాల్గొన్నారు.