ఘనంగా ముగిసిన బాలలహక్కుల పరిరక్షణ వారోత్సవాలు : ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ వెల్లడి
మదనపల్లి టౌన్,మేజర్ న్యూస్ : గతవారం రోజులుగా ఫోర్డ్,క్రై సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాల భాగంగా బాలల హక్కుల దినోత్సవాన్ని నవంబర్ 20వ తేదీ (శుక్రవారం) స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ జిల్లా లలితమ్మ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 1989లో బాలల హక్కులను అమలు చేసినప్పటికీ మనదేశంలో 1992లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు భారతదేశంలో కూడా బాలల హక్కులను పరిరక్షిస్తామని ఐక్యరాజ్యసమితిలో జరిగిన బాలల హక్కుల ఒడంబడికలో సంతకం చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ గౌతమి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఇంట్లో ప్రతి మానవునికి సమస్యలు ఉండడం సహజం,వాటిని అధిగమించడానికి మనకు ధైర్యం ఉండాలని,ఒత్తిడి ఉండకూడదని,సహనం కోల్పోకూడదని,ఏ విషయాన్నయినా సుదీర్ఘంగా ఆలోచించి మానసిక ఆవేదనకు గురికాకూడదన్నారు.క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కిరణ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో నడుచుకుని తమ లక్ష్యాలను చేరుకోవాలని,జీవితంలో మనం ఎంత ఎదగాలన్న క్రమశిక్షణ చాలా ప్రాధాన్యమైనదని తెలిపారు.ఇన్చార్జి ప్రిన్సిపాల్ శివపార్వతి దేవి మాట్లాడుతూ పిల్లల్లో బాలల హక్కులను ఉపయోగించుకొని వారి,ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఇలాంటి కార్యక్రమాలు మా కళాశాలలో నిర్వహించడం పిల్లలను చైతన్యవంతులు చేసినందుకు ఫోర్డ్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పీసీ నిర్మల,ఎంఐఎస్ గౌరీ,ప్రభావతి,సుభాషిని,స్వ ర్ణ కుమారి,అనూష,నరసింహ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి