BREAKING
పంటపాలెం పారిశ్రామిక ప్రాంతంలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేయాలని ఎస్‌ఈని కోరిన పారిశ్రామిక వినియోగదారులు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి కమలాకర్ రెడ్డి ఎన్నికల అధికారులకు శిక్షణ..! జన సందోహం మధ్య... సర్పంచ్ అభ్యర్థిగా ఆలపాక నామినేషన్ సౌత్ మోపూర్ సర్పంచ్ బరిలో బండి అంకమ్మ ఆత్మకూరు మండలంలో ఏకగ్రీవం కానున్న పలు పంచాయతీలు విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యత.. మంచినీటి ట్యాంక్ డీప్ క్లీనింగ్‌కు కార్పొరేటర్ విజయలక్ష్మి చర్యలు! ఆత్మీయ పలకరింపులతో ముగిసిన చివరి కౌన్సిల్ సమావేశం సర్పంచ్ అభ్యర్థిగా పొట్నూరు వాణి సాయి ప్రసాద్ నామినేషన్ అమ్మ చేతి వంటతో ఆరోగ్యం.. బయటి ఆహారంతో అనారోగ్యం బయటి ఆహారానికి నో చెబుదాం.. ఇంటి భోజనంతో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.. ఎన్నికల సిబ్బందికి శిక్షణా తరగతులు పాత వెల్లంటిలో సీపీఎం సర్పంచ్ అభ్యర్థిగా పల్లవరపు చెంచయ్య నామినేషన్ వినబడని ప్రజల దాహం కేకలు...! స్పెషల్ లోక్ అదాలత్"

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలి -వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు మేకపాటి విక్రమ్‌రెడ్డి పిలుపు

Select Suryaa Now
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలి -వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు మేకపాటి విక్రమ్‌రెడ్డి పిలుపు

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలని వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికల్లో విజయం సాధించిన కౌన్సిలర్లకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి విక్రమ్‌రెడ్డి సూచించారు. కూటమి ప్రభుత్వానికి ఎదురొడ్డి, అనేక ఒత్తిళ్లను అధిగమించి ప్రజల మద్దతుతో విజయం సాధించిన ప్రతి కౌన్సిలర్‌కు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 
ఆత్మకూరులోని మేకపాటి కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు, పార్టీ ముఖ్య నాయకులతో ఆయన శనివారం సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాలు, పార్టీ అభ్యర్థుల పోరాటం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ  ఓటమి భయంతో అధికార పార్టీ అడ్డదారులు తొక్కిందని విమర్శించారు. 
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలియజేశాయని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల్లోనే ఇంతటి ప్రజావ్యతిరేకతను మూటకట్టుకోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. అధికార బలం, ప్రలోభాలు, ఒత్తిళ్ల మధ్య కూడా ప్రజల మద్దతుతో పోరాడిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల కృషిని అభినందించారు.
ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లు పదవులను కేవలం హోదాలుగా భావించకుండా ప్రజలకు సేవ చేసే బాధ్యతగా గుర్తించాలని సూచించారు. వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, వీధి దీపాలు, రహదారులు తదితర సమస్యలపై నిరంతరం దృష్టి సారించాలన్నారు. 
మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, ఇప్పటికే మంజూరైన నిధుల వినియోగం, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కౌన్సిల్ సమావేశాల్లో అధికారులను ప్రశ్నించాలని చెప్పారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను సభలో ప్రస్తావించి, వాటి పరిష్కారం కోసం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులను గుర్తించామని మేకపాటి విక్రమ్‌రెడ్డి తెలిపారు. పార్టీకి కష్టకాలం ఎదురైనప్పటికీ వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరి సేవలను గుర్తించి గౌరవించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అందులో భాగంగానే వారిని జగనన్నతో కలిపి మాట్లాడించామని, కష్టకాలంలో పార్టీకి తోడుగా నిలిచిన వారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలిపారు.
ఎన్నికల్లో గెలిచిన వారితో పాటు ఓటమి ఎదురైన అభ్యర్థులు కూడా నిరుత్సాహపడకుండా ప్రజల్లోనే ఉండాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజల పక్షాన నిలబడి పనిచేసే ప్రతి ఒక్కరికీ తన సహకారం ఉంటుందని మేకపాటి విక్రమ్‌రెడ్డి భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో వైసీపీ నాయకులు 
డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య, , అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, నాగులపాటి ప్రతాప్ రెడ్డి, నందా ఓబులేసు, సీపీయం నాయకులు డేవిడ్ రాజు, సంధాని, వైఎస్సార్సీపీ నాయకులు బత్తిన నారాయణరెడ్డి, జమీర్ బాష, ఇందూరు సురేంద్రరెడ్డి, కౌన్సిలర్లు ఆండ్రా సుబ్మారెడ్డి, పఠాన్ సర్థార్ ఖాన్, యాకసిరి మల్లెం కొండయ్య, నందవరం ప్రసాద్, కావాటి సుగుణమ్మ, యల్లంటి కల్పన, నాయకులు చల్లా నరసారెడ్డి, నోటి వినయ్ కుమార్ రెడ్డి, షేక్ పర్వీన్,  చెరుకూరు కామాక్షయ్యనాయుడు, కొప్పోలు వెంకటేశ్వర్లు, ప్రభు, బత్తల కవిత, మల్లికార్జున, శ్రీనివాసులునాయుడు, ఖాదర్ బాష, మస్తాన్ వళీ తదితరులు పాల్గొన్నారు.