BREAKING
వినబడని ప్రజల దాహం కేకలు...! స్పెషల్ లోక్ అదాలత్" చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి..... ఎన్నికల సిబ్బందికి శిక్షణా తరగతులు ఆంగ్ల భాషా నైపుణ్యం పై విద్యార్థులకు ప్రతిభా పోటీలు.. ఘనంగా ముగిసిన బాలలహక్కుల పరిరక్షణ వారోత్సవాలు : ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ వెల్లడి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలి -వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు మేకపాటి విక్రమ్‌రెడ్డి పిలుపు తామరపల్లి మహిళా కళాశాల విద్యార్థుల స్వచ్ఛంద శ్రమదానం.. మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం: మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అక్రమ ఇసుక తవ్వకాలపై అటవీ శాఖ చర్యలు రెండు ఇమ్మర్షన్ మోటార్లు స్వాధీనం మదనపల్లిలో కూటమి సర్పంచ్ అభ్యర్థుల జాబితా విడుదల : కూటమి అభ్యర్థులు గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలి : మదనపల్లి ఎమ్మెల్యే షాజహన్ బాషా ఆదేశం సిరిసిల్ల నుంచి పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సు 40వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం సైదాపురం సర్పంచ్ అభ్యర్థిగా బోల్లిగర్ల అర్చన నామినేషన్ దాఖలు మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

మిట్స్‌లో ఆర్థిక అక్షరాస్యత,స్మార్ట్ పెట్టుబడి విధానాలపై వర్క్‌షాప్ : ముఖ్యఅతిథిగా హాజరైన సెబీ స్మార్ట్ ప్రతినిధి డాక్టర్ మూర్తి

Select Suryaa Now
మిట్స్‌లో ఆర్థిక అక్షరాస్యత,స్మార్ట్ పెట్టుబడి విధానాలపై వర్క్‌షాప్ : ముఖ్యఅతిథిగా హాజరైన సెబీ స్మార్ట్ ప్రతినిధి డాక్టర్ మూర్తి

కురబలకోట,మేజర్ న్యూస్ : మదనపల్లి సమీపంలో గల (మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విభాగం వారు ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు ఫైనాన్షియల్ లిటరసీ అండ్ స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాక్టీసెస్ అనే అంశంపై రెండు రోజులపాటు వర్క్‌షాప్ నిర్వహించారు.శనివారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెబీ స్మార్ట్ ప్రతినిధి డాక్టర్ మూర్తి పాల్గొని,విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత,పొదుపు,పెట్టుబడి ప్రణాళికలు,ఆధునిక ఆర్థిక మార్కెట్లపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెపో రేటు,రివర్స్ రెపోరేటు,గోల్డ్ ఈటీఎఫ్‌లు,సిల్వర్ ఈటీఎఫ్‌లు,స్టాక్ మార్కెట్‌లో ప్రత్యక్ష ట్రేడింగ్,మ్యూచువల్ ఫండ్స్,ఆర్థిక వ్యవస్థలో నగదు చలామణి తదితర అంశాలను వివరించారు.అదేవిధంగా షేర్ల కొనుగోలు,విక్రయాలు,డీమ్యాట్ ఖాతా వినియోగం,పెట్టుబడులపై రాబడులు,మార్కెట్ ఒడిదొడుకులు,ద్రవ్యోల్బణం ప్రభావం వంటి అంశాలను ఉదాహరణలతో వివరించారు.విద్యార్థులు తమ ఆదాయానికి అనుగుణంగా బడ్జెట్ రూపొందించుకోవడం,అనవసర ఖర్చులను నియంత్రించడం,క్రమబద్ధమైన పొదుపు అలవాట్లను పెంపొందించుకోవడం,దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం ఎంతో ముఖ్యమన్నారు.పెట్టుబడులు పెట్టే ముందు సంబంధిత ఆర్థిక సాధనాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని,రిస్క్,రిటర్న్ మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవాలని వివరించారు.ముఖ్యంగా ఒకే పెట్టుబడి సాధనంపై ఆధారపడకుండా వివిధ మార్గాల్లో పెట్టుబడులను విభజించడం,చక్రవడ్డీ ప్రయోజనాలను పొందడం,అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం,ఆర్థిక మోసాలు మరియు అధిక లాభాల పేరుతో జరిగే మోసపూరిత పథకాల పట్ల అప్రమత్తంగా ఉండటం వంటి అంశాల ప్రాధాన్యతను తెలియజేశారు.ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు అకడమిక్ పరిజ్ఞానంతోపాటు వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ నైపుణ్యాలు కూడా అత్యంత అవసరమన్నారు.ముఖ్యం గా ఎంబీఏ,బీబీఏ విద్యార్థులు భవిష్యత్తులో మేనేజ్‌మెంట్,బ్యాంకింగ్,ఫైనాన్స్,బిజినెస్ అనలిటిక్స్,ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ తరహా అవగాహన కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్,డీన్-స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భానుశ్రీ రెడ్డి,కో-ఆర్డినేటర్ డాక్టర్ జ్ఞాన ప్రసూన,డాక్టర్ గంగిశెట్టి,అధ్యాపకులు,ఎంబీఏ,బీబీఏ విద్యార్థులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి