BREAKING
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలి* *నామినేషన్ పత్రాలు, ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అభ్యర్థులకు రసీదులు అందజేయాలి* *నామినేషన్ కేంద్రంలో రికార్డుల నిర్వహణ, అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రచారం: కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కలికి రాధామాధవిలకు విశేష స్పందన కోహిర్ ఎస్సీ బాలికల వసతి గృహ విద్యార్థులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కావలిలో మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ పర్యటన: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో మర్యాదపూర్వక భేటీ. ఎన్నికల ప్రచారానికి ముందస్తు అనుమతులు తప్పనిసరి..ఎస్సై శ్రీనివాసులు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఆంజనేయులు ముగిసిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మహిళలు స్వయం శక్తితో ఎదగడమే మెదక్ మిల్లీ అసోసియేషన్ లక్ష్యం కుట్టు శిక్షణ పూర్తి చేసిన 44 మంది మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేసే పంటలపై రైతులకు అవగాహన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు నెల్లూరు జిల్లాలో విద్యుత్ రంగానికి మహర్దశ శ్రీరాయగిరి వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కైశిక ద్వాదశి ప్రత్యేక పూజలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నాం ఫ జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్

23 నుండి గంగవరంలో ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు

Select Suryaa Now
23 నుండి గంగవరంలో ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
ఇంకొల్లు మండలంలోని గంగవరం గ్రామంలో శ్రీ గంగా పార్వతి సమేత భీమలింగేశ్వర స్వామి, శ్రీ వీరభద్ర స్వామి, శ్రీ గణపతి స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ అయ్యప్ప స్వామి, నవగ్రహ దేవతలు మరియు ఇతర దేవతా మూర్తులు, యంత్రాలు మరియు ధ్వజ స్తంభముల ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు ఈనెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 23న ఉదయం 6.30 నుండి గంగపూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. అనంతరం మృత్సంగ్రహణం, గోపూజ, ఆలయ ప్రవేశం, గణపతి పూజ, గౌరి పూజ, శైవ పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశనం, ఋత్విక్‌ వరణం, యాగశాల ప్రవేశం, హారతి, తీర్ధప్రసాద వితరణ, సాయంత్రం 6.15 నుండి టి.టి.డి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల బృందంచే ఆధ్యాత్మిక సంగీత కచేరి, సీతా విజయేశ్వరీ పరివార్‌ రమా సుందరి అమ్మ అద్దంకి వారిచే ఆధ్యాత్మిక ప్రవచనామృతం 24న గణపతి పూజ, నవగ్రహ-వాస్తు పూజ, మంటప దేవతా కలశ స్థాపన, చతుష్షష్టి యోగినీ దేవతా పూజ, చతుర్లింగ మండల పూజ, ప్రధాన కలశ స్థాపన, హారతి, తీర్థ ప్రసాద వితరణ, సాయంత్రం 3.3. నుండి అగ్ని ప్రతిష్ట, లక్ష్మీ గణపతి హోమం, వాస్తు హోమం, నూతన యంత్ర విగ్రహములకు పంచగవ్య పంచామృత అభిషేకములు, హారతి, తీర్థ ప్రసాద వితరణ, సాయంత్రం 4.30 నుండి దేవతామూర్తుల గ్రామోత్సవం, జలాధివాసం, హారతి, తీర్థప్రసాద వితరణ, సాయంత్రం 6.15 నుండి టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారుల బృందంచే ఆధ్యాత్మిక సంగీత కచేరి, రాత్రి 7.30 నుండి సీతా విజయేశ్వరీ పరివార్‌ రమా సుందరి అమ్మ అద్దంకి వారిచే ఆధ్యాత్మిక ప్రవచనామృతం, శాస్త్రీయ నృత రూపకాలు, వంటి కార్యక్రమాలు ప్రతి రోజు నిర్వహిస్తారన్నారు. 27వ తేదీ ఉదయం 8.5 నుండి 9.05 నిలకు యంత్ర, నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు అనంతరం అన్నదానం కార్యక్రమలు జరుగుతాయన్నారు. ఐదు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భక్తులంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.