మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
యర్రగుంట్ల మేజర్ న్యూస్ : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రిన్సిపాల్ త్రివిక్రమ్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ కేంద్రం – కడప మరియు వికసిత ఫౌండేషన్ సంయుక్తంగా యర్రగుంట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నషా ముక్త్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ సీఐ గోపికృష్ణ, ఎస్‌ఐ రామకృష్ణ మోటివేషనల్ స్పీకర్ సోమల సంజీవ రాయుడు మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందని, కుటుంబాలు మరియు సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్య, క్రీడలు, సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నషా ముక్త్ యువ అనే అంశంపై ప్రసంగ పోటీ నిర్వహించారు. పోటీలో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థుల్లో వక్తృత్వ నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థుల్లో వక్తృత్వ నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వేణుగోపాల్, మోటివేషనల్ స్పీకర్ సోమల సంజీవ రాయుడు వికసిత ఫౌండేషన్ తరఫున శ్రీమతి శూలం లక్ష్మీదేవి పాల్గొన్నారు.