కావలిలో మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ పర్యటన: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో మర్యాదపూర్వక భేటీ.
కావలి, మేజర్ న్యూస్ : రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ శనివారం కావలిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్థానిక శాసనసభ్యులు దాగుమాటి కావ్య కృష్ణారెడ్డి నివాసానికి విచ్చేసి, ఎమ్మెల్యేతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
తమ నివాసానికి విచ్చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సాదర స్వాగతం పలికి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై చర్చ:
అనంతరం ఇరువురు నేతలు కావలి మున్సిపల్ ఎన్నికల సరళి, కూటమి అభ్యర్థుల గెలుపు అవకాశాలు, ప్రచార వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. పట్టణంలోని వార్డుల వారీగా ఉన్న రాజకీయ పరిస్థితులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మంత్రికి వివరించారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేసి కావలి మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగురవేయాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల స్థానిక ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.