ముగిసిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
అనుమసముద్రంపేట, మేజర్ న్యూస్ : ఏ ఎస్ పేట శాఖా గ్రంథాలయం ఆధ్వర్యంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశం ఎం పి పి పాఠశాల(ఉర్దూ) నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు యు. మల్లికార్జునరావు, ఎస్.వెంకటయ్య మరియు ఉపాధ్యాయినులు జె. రాజేశ్వరి, షేక్ జాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వారోత్సవాల సందర్భంగా బాల బాలికలకు డ్రాయింగ్, దేశభక్తి గీతాలు నిర్వహించారు ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసి పుస్తకపఠన ప్రయోజనాలను సమాజంలో గ్రంథాలయాలు ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించడం జరిగింది. అనంతరం లైబ్రేరియన్ ఓ. శ్రీనివాస రాజు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి గ్రంథాలయాన్ని సందర్శించే విధంగా ఉపాధ్యాయులు మరియు వారి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని తెలియజేశారు. తదుపరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లుని శాలువాతో సన్మానించారు. అనంతరం లైబ్రేరియన్ వందన సమర్పణతో కార్యక్రమం ముగించారు