BREAKING
పంటపాలెం పారిశ్రామిక ప్రాంతంలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేయాలని ఎస్‌ఈని కోరిన పారిశ్రామిక వినియోగదారులు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి కమలాకర్ రెడ్డి ఎన్నికల అధికారులకు శిక్షణ..! జన సందోహం మధ్య... సర్పంచ్ అభ్యర్థిగా ఆలపాక నామినేషన్ సౌత్ మోపూర్ సర్పంచ్ బరిలో బండి అంకమ్మ ఆత్మకూరు మండలంలో ఏకగ్రీవం కానున్న పలు పంచాయతీలు విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యత.. మంచినీటి ట్యాంక్ డీప్ క్లీనింగ్‌కు కార్పొరేటర్ విజయలక్ష్మి చర్యలు! ఆత్మీయ పలకరింపులతో ముగిసిన చివరి కౌన్సిల్ సమావేశం సర్పంచ్ అభ్యర్థిగా పొట్నూరు వాణి సాయి ప్రసాద్ నామినేషన్ అమ్మ చేతి వంటతో ఆరోగ్యం.. బయటి ఆహారంతో అనారోగ్యం బయటి ఆహారానికి నో చెబుదాం.. ఇంటి భోజనంతో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.. ఎన్నికల సిబ్బందికి శిక్షణా తరగతులు పాత వెల్లంటిలో సీపీఎం సర్పంచ్ అభ్యర్థిగా పల్లవరపు చెంచయ్య నామినేషన్ వినబడని ప్రజల దాహం కేకలు...! స్పెషల్ లోక్ అదాలత్"

ప్రచారం: కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కలికి రాధామాధవిలకు విశేష స్పందన

Select Suryaa Now
ప్రచారం: కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కలికి రాధామాధవిలకు విశేష స్పందన

​కావలి, మేజర్ న్యూస్ :  కావలి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పట్టణంలోని 13వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విస్తృతంగా పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కలికి రాధామాధవితో కలిసి వార్డులో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.  ​ఈ సందర్భంగా అభ్యర్థులకు వార్డులోని మహిళలు, స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లిన అభ్యర్థులు, ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ తమకు మద్దతు తెలపాలని అభ్యర్థించారు.  
​పట్టణ సమగ్రాభివృద్ధే నా లక్ష్యం: కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి
ప్రచార కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎన్నో సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ సేవ చేస్తున్నానని, ఎప్పుడూ పదవులను ఆశించలేదని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కావలి పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో తమను గెలిపిస్తే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి, వార్డుల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  
​నాయకులు, కార్యకర్తల సందడి:
13వ వార్డు వైఎస్సార్‌సీపీ మాజీ కౌన్సిలర్ కలికి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో బీసీ నాయకులు ప్రభాకర్, వరప్రసాద్, కృష్ణ, ప్రసాద్ రెడ్డి, శ్యామ్‌తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అభ్యర్థులకు మద్దతుగా కార్యకర్తలు చేసిన నినాదాలతో 13వ వార్డులో ఎన్నికల సందడి నెలకొంది.