శ్రీరాయగిరి వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కైశిక ద్వాదశి ప్రత్యేక పూజలు
కౌడిపల్లి :కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలోని శ్రీరాయగిరి వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కైశిక ద్వాదశి పర్వదిన సందర్భంగా దేవాలయ ప్రధానార్చకులు శ్రీమాన్ మంగళగిరి అనంత కృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్వదిన సందర్భంగా దేవాలయంలో విశేష అలంకరణ, ప్రబంధ పారాయణం ,కైశిక ద్వాదశి మహోత్సవం, నంబాడుబాన్ ఆచార్యుల చరిత్ర విశేషం(పారాయణ), శ్రీలక్ష్మీ నారాయణుల హవనం , సాయంత్రం బృందా దామోదరుల కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెల్మకన్న గ్రామ మాజీ సర్పంచ్ రాజేందర్, గ్రామ పెద్దలు రెడ్డి నర్సింలు, విఠల్, బాల్ లింగం, భూమయ్య, కారోబార్ నాగభూషణం, రామలింగం, శ్రీమతి మంగళగిరి మధురవాణి మురళీధర్(కన్నయ్య కుమారి), మంగళగిరి అనంతమ్మ, మలిపెద్ది సునీత శ్రీనివాస్, మంగళగిరి, యాదమ్మ, తులసి సరస్వతి, ధర్మపురి జయశ్రీ, మలిపెద్ది అనంతమ్మ, కన్నమల్ల శ్రీలత తదితరులు పాల్గొన్నారు.*