BREAKING
వినబడని ప్రజల దాహం కేకలు...! స్పెషల్ లోక్ అదాలత్" చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి..... ఎన్నికల సిబ్బందికి శిక్షణా తరగతులు ఆంగ్ల భాషా నైపుణ్యం పై విద్యార్థులకు ప్రతిభా పోటీలు.. ఘనంగా ముగిసిన బాలలహక్కుల పరిరక్షణ వారోత్సవాలు : ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ వెల్లడి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలి -వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు మేకపాటి విక్రమ్‌రెడ్డి పిలుపు తామరపల్లి మహిళా కళాశాల విద్యార్థుల స్వచ్ఛంద శ్రమదానం.. మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం: మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అక్రమ ఇసుక తవ్వకాలపై అటవీ శాఖ చర్యలు రెండు ఇమ్మర్షన్ మోటార్లు స్వాధీనం మదనపల్లిలో కూటమి సర్పంచ్ అభ్యర్థుల జాబితా విడుదల : కూటమి అభ్యర్థులు గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలి : మదనపల్లి ఎమ్మెల్యే షాజహన్ బాషా ఆదేశం సిరిసిల్ల నుంచి పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సు 40వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం సైదాపురం సర్పంచ్ అభ్యర్థిగా బోల్లిగర్ల అర్చన నామినేషన్ దాఖలు మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

ఇరుకాలమ్మ సబ్‌స్టేషన్‌లో అదనపు 8 ఎంవిఎ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ అండ్ 33 కెవి బ్రేకర్ ఏర్పాటు

Select Suryaa Now
ఇరుకాలమ్మ సబ్‌స్టేషన్‌లో అదనపు 8  ఎంవిఎ  పవర్ ట్రాన్స్‌ఫార్మర్ అండ్ 33 కెవి బ్రేకర్ ఏర్పాటు

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ :  నెల్లూరు టౌన్ డివిజన్ పరిధిలోని రాజేంద్రనగర్ సబ్ డివిజన్, రాజేంద్రనగర్ సెక్షన్‌కు చెందిన ఇరుకాలమ్మ సబ్‌స్టేషన్‌లో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ లోడ్‌ను దృష్టిలో ఉంచుకొని అదనంగా 8  ఎం వి ఏ  సామర్థ్యం గల పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి  విజయవంతంగా ఛార్జింగ్ చేయడం జరిగిందని తెలిపారు . ఇప్పటికే ఈ సబ్‌స్టేషన్‌లో 8 ఎం వి ఏ   పవర్ ట్రాన్స్‌ఫార్మర్ అందుబాటులో ఉండగా, పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మరో 8 ఎం వి ఏ  పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు 33 కెవి బ్రేకర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ పనులకు మొత్తం సుమారు రూ.1.64 కోట్ల వ్యయం చేసినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆపరేషన్ టౌన్ డివిజన్, నెల్లూరు  ఎం. శ్రీధర్ శనివారం తెలిపారు.

ఈ అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా శివగిరి కాలనీ, సాయినగర్, ఇరుకాలమ్మ సంఘం, మహేశ్వరి నగర్, రాజీవ్ గృహకల్ప, పోలీస్ కాలనీ, శాంతినగర్, రామయ్యబడి రోడ్డు, రాజావారి వీధి, పల్లెమిట్ట, చాముండివారి తోట, బట్వాడిపాలెం తదితర ప్రాంతాలతో పాటు నెల్లూరు రూరల్ పరిధిలోని నరసింహకొండ వరకు విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడనుంది. దీనివల్ల ఆయా ప్రాంతాల వినియోగదారులకు మెరుగైన వోల్టేజ్‌తో నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అవకాశం కలుగుతుందని శ్రీధర్  పేర్కొన్నారు.వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ మెరుగైన సేవలు అందించడమే ఎస్పీడీసీఎల్ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్లు  సతీష్,సుప్రియ, అసిస్టెంట్ ఇంజనీర్  గాయత్రి, టీఆర్ఈ సిబ్బంది, ఓ అండ్ ఎం సిబ్బంది పాల్గొన్నారు.