BREAKING
వినబడని ప్రజల దాహం కేకలు...! స్పెషల్ లోక్ అదాలత్" చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి..... ఎన్నికల సిబ్బందికి శిక్షణా తరగతులు ఆంగ్ల భాషా నైపుణ్యం పై విద్యార్థులకు ప్రతిభా పోటీలు.. ఘనంగా ముగిసిన బాలలహక్కుల పరిరక్షణ వారోత్సవాలు : ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ వెల్లడి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలి -వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు మేకపాటి విక్రమ్‌రెడ్డి పిలుపు తామరపల్లి మహిళా కళాశాల విద్యార్థుల స్వచ్ఛంద శ్రమదానం.. మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం: మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అక్రమ ఇసుక తవ్వకాలపై అటవీ శాఖ చర్యలు రెండు ఇమ్మర్షన్ మోటార్లు స్వాధీనం మదనపల్లిలో కూటమి సర్పంచ్ అభ్యర్థుల జాబితా విడుదల : కూటమి అభ్యర్థులు గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలి : మదనపల్లి ఎమ్మెల్యే షాజహన్ బాషా ఆదేశం సిరిసిల్ల నుంచి పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సు 40వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం సైదాపురం సర్పంచ్ అభ్యర్థిగా బోల్లిగర్ల అర్చన నామినేషన్ దాఖలు మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

పెద్దపంజాణిలో ముగిసిన ఉపసంహరణల పర్వం

Select Suryaa Now
పెద్దపంజాణిలో ముగిసిన  ఉపసంహరణల పర్వం


చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండల పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది చిత్రం స్పష్టమైంది. దీంతో మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. మండలంలో  180 వార్డులు ఏకగ్రీవం కాగా 24 సర్పంచ్ స్థానాలకు 56 మంది పోటీలో మిగిలినట్లు అధికారులు తెలిపారు.  మండలంలోని మొత్తం 25 గ్రామ పంచాయతీలకు గాను వీరప్పల్లి  సర్పంచ్ స్థానం ఏకగ్రీవం కాగా, మిగిలిన 24 పంచాయతీలలో 56 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 
మండలంలోని వీరపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానంతో పాటు అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో అధికారులు ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహించగా, సుద్దగుండ్లపల్లి గ్రామానికి చెందిన కందప్ప గారి గోవిందప్ప వీరపల్లి ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మండలంలోని మొత్తం 248 వార్డులకు గాను 180 వార్డులు ఏకగ్రీవంగా ఎంపికయ్యాయి. ముఖ్యంగా అమ్మరాజుపల్లి, బొమ్మరాజుపల్లి, చామనేరు, కొలత్తూరు, లింగాపురం, నాగిరెడ్డిపల్లి, నిడిగుంట, రాజుపల్లి, శంకర్ రాయలపేట, శివాడి, తుర్లపల్లి, వీరపల్లి, మాదనపల్లి గ్రామ పంచాయతీల పరిధిలోని అన్ని వార్డులు పూర్తిగా ఏకగ్రీవం కావడం విశేషం.
వీరపల్లి మినహా మిగిలిన 24 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ పదవి కోసం హోరాహోరీ పోరు నెలకొంది. మొత్తం 56 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో మిగిలారు.పెద్దపంజాణి మేజర్ గ్రామ పంచాయతీలో నలుగురు అభ్యర్థులు పోటీ పడుతుండగా,బట్టందొడ్డి, కరసనపల్లి, లింగాపురం, పెద్దారికుంట, రాజుపల్లి, శివాడి పంచాయతీలలో ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
మిగిలిన 17 గ్రామ పంచాయతీలలో ఇద్దరు అభ్యర్థుల చొప్పున ముఖాముఖి పోటీ నెలకొంది.

ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి రిపోర్టర్ పెద్దపంజాణి