వైకుంఠపురంలో కూటమి శంఖారావం .. జనప్రభంజనంతో భారీ ర్యాలీ
కావలి, మేజర్ న్యూస్ : కావలి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకుంఠపురంలో కూటమి నేతలు నిర్వహించిన భారీ ర్యాలీ జనప్రభంజనాన్ని తలపించింది. మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూటమి శ్రేణులతో కలిసి వైకుంఠపురంలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల శంఖారావం పూరించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి భరత్ కుమార్‌తో పాటు 44 మంది కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. వచ్చే ఏడాది మార్చిలో కలుగోలమ్మ తల్లి బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. వైకుంఠపురం ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వైకుంఠపురం గడ్డపై కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఈ ప్రచార ర్యాలీలో కూటమి నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.