కేంద్ర జల వనరుల శాఖ బృందం పర్యటన
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నీటి యాజమాన్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ నిర్వహణ పనితీరును పరిశీలించేందుకు కేంద్ర జల వనరుల శాఖ బృంద సభ్యులు కొల్లి రాంబాబు, డాక్టర్ ఎండి. పాషా గత మూడు రోజులుగా సంగం మండలం మహమ్మాదాపురంలోని వాటర్ ట్రీట్మెం ట్ ప్లాంట్, నెల్లూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లు, ఓవర్హెడ్ వాటర్ ట్యాంకులు, ఇంకుడు గుంతలను పరిశీలించారు. నగర పాలక సంస్థ పరిధిలో నీటి నిర్వహణ పనులను జాతీయ జల పురస్కారానికి ఎంపిక చేయడానికి పరిశీలిస్తున్నట్లు వారు వెల్లడించారు. జలకాలుష్య నివారణ, నీటిని పొదుపు, పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తారని వివరించారు. ముఖ్యంగా భూగర్భ జలాల పెంపు కోసం నగరపాలక సంస్థ చేపడుతున్న పనులు అభినందనీయమన్నారు. ఈ పనులను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత కేంద్రానికి నివేదిక పంపి, అవార్డు కోసం సిఫారసు చేస్తామన్నారు. బృందం వెంట ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ, చంద్రయ్య పి.ఎమ్.యు సాయికృష్ణ ఉన్నారు.