BREAKING
ముగిసిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మహిళలు స్వయం శక్తితో ఎదగడమే మెదక్ మిల్లీ అసోసియేషన్ లక్ష్యం కుట్టు శిక్షణ పూర్తి చేసిన 44 మంది మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేసే పంటలపై రైతులకు అవగాహన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు నెల్లూరు జిల్లాలో విద్యుత్ రంగానికి మహర్దశ శ్రీరాయగిరి వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కైశిక ద్వాదశి ప్రత్యేక పూజలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నాం ఫ జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ పెద్దపంజాణిలో ముగిసిన ఉపసంహరణల పర్వం గుండె తీసినంత పనయింది ( కథ ) లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు మిట్స్‌లో ఆర్థిక అక్షరాస్యత,స్మార్ట్ పెట్టుబడి విధానాలపై వర్క్‌షాప్ : ముఖ్యఅతిథిగా హాజరైన సెబీ స్మార్ట్ ప్రతినిధి డాక్టర్ మూర్తి ఇరుకాలమ్మ సబ్‌స్టేషన్‌లో అదనపు 8 ఎంవిఎ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ అండ్ 33 కెవి బ్రేకర్ ఏర్పాటు రైల్వే రోడ్డులో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి కనుమర్లపూడి వెంకటనారాయణ జోరుగా ఇంటింటి ప్రచారం. 23 నుండి గంగవరంలో ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు 26వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టిడిపి అభ్యర్థి కోట సురేందర్ రెడ్డి కి మహిళలు బ్రహ్మరథం..!

రోడ్డు ప్రమాద బాధితులను కాపాడితే రూ.25 వేల నగదు ప్రోత్సాహకం

Select Suryaa Now
రోడ్డు ప్రమాద బాధితులను కాపాడితే రూ.25 వేల నగదు ప్రోత్సాహకం

నెల్లూరు కలెక్టరేట్, మేజర్ న్యూస్ ;  రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను కాపాడేందుకు సకాలంలో స్పందించే వారికి కేంద్ర ప్రభుత్వం రూ.25 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తోందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. ప్రమాదం జరిగిన మొదటి గంటలోపు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి లేదా ట్రామా కేర్ సెంటర్‌కు చేర్చే వారికి కేంద్ర ప్రభుత్వ ‘రాహ్-వీర్ (RAH-VEER)’ పథకం కింద నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం అందజేస్తామని వెల్లడించారు.  రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2023 అక్టోబర్ 3న ప్రారంభించిన ఈ పథకం ఆంధ్రప్రదేశ్‌లోనూ అమల్లో ఉందన్నారు. గతంలో రూ.5 వేలుగా ఉన్న ప్రోత్సాహకాన్ని రూ.25 వేలకు పెంచినట్లు తెలిపారు. ఒక ప్రమాద ఘటనలో గరిష్ఠంగా ఐదుగురు సహాయకులకు ఈ ప్రోత్సాహకం అందించే అవకాశం ఉందన్నారు.

సహాయం చేసేందుకు భయపడాల్సిన అవసరం లేదు

కులం, మతం, ప్రాంతం, వృత్తితో సంబంధం లేకుండా సామాన్య పౌరులు, ఆటో డ్రైవర్లు, వాహనదారులు, స్థానిక ప్రజలు ఈ పథకానికి అర్హులని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రమాద బాధితులకు సహాయం చేసే వారిని అనవసరమైన పోలీసు విచారణలు, వేధింపులకు గురిచేయకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రక్షణ కల్పిస్తారని తెలిపారు.

ప్రోత్సాహకం పొందే విధానం

క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువెళ్లిన వారి వివరాలను ఆసుపత్రి సిబ్బంది నమోదు చేస్తారు. అనంతరం పోలీసులు ప్రమాద వివరాలను పరిశీలించి అర్హతను నిర్ధారిస్తారు. సంబంధిత ప్రతిపాదనలను జిల్లా రహదారి భద్రత విభాగం, రవాణా శాఖకు పంపిస్తారు. జిల్లా రవాణా అధికారి ద్వారా కలెక్టర్‌కు సిఫార్సు చేసిన అనంతరం ఆమోదం పొందిన వారికి నిబంధనల ప్రకారం నగదు ప్రోత్సాహకాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.

ప్రజల్లో అవగాహన కల్పించాలి

రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆటో, లారీ డ్రైవర్లు, జాతీయ రహదారుల వెంబడి ఉన్న హోటళ్లు, దాబాల నిర్వాహకులు, స్థానిక ప్రజలకు ఈ పథకంపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.  రోడ్డు ప్రమాదాలను చూసి నిర్లక్ష్యంగా వెళ్లిపోకుండా మానవతా దృక్పథంతో స్పందించి బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 108 లేదా 112కు సమాచారం అందించాలని సూచించారు. ప్రతి ప్రాణం విలువైనదని, సకాలంలో అందించే సహాయం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్ల పేర్కొన్నారు.