పరిశోధన రంగంలో భాగ్యకు డాక్టరేట్
ద్రావిడ విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగంలో పరిశోధనకు గుర్తింపు
గుడిపల్లి మేజర్ న్యూస్: ద్రావిడ విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగంలో పి.ఎం. భాగ్య పీహెచ్‌డీ పట్టా పొందారు. కెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా. శోభారాణి పరిశోధన పర్యవేక్షణలో భాగ్య తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు.
'ఎకో ఫ్రెండ్లీ అప్రోచ్ ఫర్ సింథసిస్ ఆఫ్ సిల్వర్ అండ్ కాపర్ నానో పార్టికల్స్ ఫ్రం అకేషియా అరేబికా సీడ్స్ ఎక్స్ట్రాక్ట్ అండ్ దేర్ బయోలాజికల్ యాక్టివిటీస్' అనే అంశంపై పరిశోధన చేసి, పరిశోధన గ్రంథాన్ని ద్రావిడ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. ఈ పరిశోధనను పరిశీలించిన అనంతరం విశ్వవిద్యాలయం ఆమెకు పీహెచ్‌డీ పట్టా ప్రదానం చేసింది.
భాగ్య సాధించిన ఈ విజయంపై ద్రావిడ విశ్వవిద్యాలయ ఉపాధ్యాయ బృందం, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఆమెను అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
సూర్య రిపోర్టర్ : లెనిన్ బాబు,గుడిపల్లి మండలం.