BREAKING
23 నుండి గంగవరంలో ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు 26వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టిడిపి అభ్యర్థి కోట సురేందర్ రెడ్డి కి మహిళలు బ్రహ్మరథం..! అంగరంగ వైభావంగా శ్రీలక్ష్మి నారాయణ, శివపార్వతుల కళ్యాణం రక్తదాన ఉద్యమంలో యువత భాగస్వాములు కావాలి: మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి క్రిమినల్స్ ల్లో తొలగిన ఎన్ఓసీ టెన్షన్..! -ఎన్నికల్లో పోటీకి ఎస్ఈసీ గ్రీన్ సిగ్నల్..? 9 నెలల్లో 334 కోట్లతో నగరాభివృద్ధి - మేయర్ దేవరకొండ సుజాత పేదల సొంతింటి కలకు నిజరూపం కేంద్ర జల వనరుల శాఖ బృందం పర్యటన కేంద్ర జల వనరుల శాఖ బృందం పర్యటన రోడ్డు ప్రమాద బాధితులను కాపాడితే రూ.25 వేల నగదు ప్రోత్సాహకం వైకుంఠపురంలో కూటమి శంఖారావం .. జనప్రభంజనంతో భారీ ర్యాలీ వేంపల్లి వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా మాలేపాడు శోభారాణి నామినేషన్ సర్పంచ్ నామినేషన్లన్నీ ఆమోదం.. వార్డుల్లో నాలుగు తిరస్కరణ! ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్ వినియోగంపై శిక్షణ కార్యక్రమం పరిశోధన రంగంలో భాగ్యకు డాక్టరేట్

పర్చూరు నియోజకవర్గంలో 31 పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవం

Select Suryaa Now
పర్చూరు నియోజకవర్గంలో 31 పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవం

పర్చూరు:

రాష్ట్రంలో ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికలైనా, బ్యాలెట్ పేపర్లతో నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలైనా ప్రజలు ఎన్డీయే కూటమి వైపే నిలుస్తున్నారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ధీమా వ్యక్తం చేశారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. పర్చూరు నియోజకవర్గంలో ఇప్పటికే 31 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని వెల్లడించారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి, గ్రామాల్లో టీడీపీకి లభిస్తున్న ఆదరణకు ఇది నిదర్శనమన్నారు.

కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు సమన్వయంతో పనిచేసి విజయాలు సాధించాయని తెలిపారు. అదే ఐక్యత, సమన్వయంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ముందుకు సాగుతామని చెప్పారు. గ్రామాల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి అభ్యర్థులను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ట్రిపుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి పరుగులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు అభివృద్ధి వేగవంతమవుతుందని ఏలూరి పేర్కొన్నారు. ట్రిపుల్ ఇంజిన్ సర్కారు ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని చెప్పారు.

బీసీలకు సామాజిక న్యాయానికి ప్రాధాన్యం

బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేసిందని, పార్టీ పరంగా 40 శాతం మేర సీట్లు కేటాయించి సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందని వివరించారు. అన్ని వర్గాలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యం కల్పించడమే కూటమి లక్ష్యమన్నారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు

గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో దాడులు, దౌర్జన్యాలు, అక్రమాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు విశ్వసించడం లేదన్నారు.

రాష్ట్రంలో ఎదురైన ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వం వేగంగా స్పందించి సహాయక, పునరుద్ధరణ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. రైతులు, పేదలు, సామాన్య ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ పాలన సాగుతోందన్నారు.

గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర సమగ్ర ప్రగతి సాధ్యమవుతుందని, ప్రతి పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఏలూరి తెలిపారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ, కూటమి బలపరిచిన అభ్యర్థులకు ప్రజలు అండగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విజ్ఞప్తి చేశారు.