హెచ్‌ఐవీ నియంత్రణలో చిత్తూరు జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: హెచ్‌ఐవీ నియంత్రణ కార్యక్రమాల అమలులో చిత్తూరు జిల్లాకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన 95-95-95 లక్ష్యాలను (హెచ్‌ఐవీ నిర్ధారణ, చికిత్స, వైరస్ నియంత్రణ) చిత్తూరు జిల్లా విజయవంతంగా సాధించడంతో ‘సురక్షిత్’ హోదా లభించిందని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఏ. నాగ శశి భూషణ రెడ్డి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డా. జి. వెంకట ప్రసాద్‌లకు డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో అవార్డు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ గుర్తింపు జిల్లాలో హెచ్‌ఐవీ వ్యాధి నిర్ధారణ, ఏఆర్‌టీ చికిత్సా సేవలు, వైరస్ నియంత్రణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కృషికి నిదర్శనమని అధికారులు తెలిపారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.