ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల రాస్తారోకో 365బీ జాతీయ రహదారిపై ధర్నా.. నిలిచిపోయిన వాహనాల రాకపోకలు
lచేర్యాల ....చేర్యాల: ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ చేర్యాల మండలం వేచరేణి గ్రామ రైతులు శనివారం 365 -బీ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా వేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకోతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు కోరారు.