BREAKING
గవర్నర్‌ను కలిసిన వైసీపీ బృందం.. ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదు రామకృష్ణ పై పీ డి యాక్ట్ నమోదు ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ..... రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికైన న్యూ రిషి పాఠశాల విద్యార్థులు నేడు యుసుప్ పూర్ గ్రామంలో పోలియో చుక్కల కార్యక్రమం ప్రజాస్వామ్య పరిరక్షణకు కదం తొక్కనున్న మహా పాదయాత్ర క్షిపణి దాడుల కంటే ఆర్థిక యుద్ధమే కఠినం.. బాలల రక్షణకు ఉపాధ్యాయులే కీలక రక్షకులు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో “లైఫ్ మేనేజ్‌మెంట్”పై అవగాహన కార్యక్రమం ఏ.ఎస్.డీ.డీ ఓటర్లకు మరో అవకాశం కల్పించి అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చాలి. సీపీఐ బలోపేతానికి క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలి - సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి - చాడ వెంకటరెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా - జిల్లా కలెక్టర్ కె.హరిత వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్ -స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం ముదిగుబ్బ సర్పంచ్ బరిలో ఏడుగురు అభ్యర్థులు జలసిరి పనులపై అవగాహన

జిల్లాలో 151 చెక్ బౌన్స్ కేసుల స్పెషల్ లోక్ అదాలత్ పరిష్కారం

Select Suryaa Now
జిల్లాలో 151 చెక్ బౌన్స్ కేసుల స్పెషల్ లోక్ అదాలత్ పరిష్కారం

గుంటూరు : జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు, గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీ బి. సాయి కల్యాణ చక్రవర్తి నేతృత్వంలో శనివారం నాడు జిల్లా వ్యాప్తంగా చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక (స్పెషల్) లోక్ అదాలత్‌ను నిర్వహించారు.ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌లో కక్షిదారుల మధ్య రాజీ కుదర్చడం ద్వారా జిల్లా వ్యాప్తంగా మొత్తం 151 చెక్ బౌన్స్ కేసులను న్యాయమూర్తులు పరిష్కరించారు. పరిష్కారమైన ఈ కేసులకు సంబంధించి మొత్తం చెక్ విలువ రూ. 4,56,56,132/- (నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల యాభై ఆరు వేల నూట ముప్పై రెండు రూపాయలు) కాగా, ఇరువర్గాల అంగీకారంతో రూ. 3,25,09,403/- (మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల మూడు రూపాయలు) మొత్తానికి సెటిల్‌మెంట్ కుదిరినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శనివారం తెలిపారు.

 

సూర్య నాయక్