ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ పెండింగ్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*
*ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ పెండింగ్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి*
*జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*
కర్నూలు, నవంబర్ 21:- ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ కి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఏపీఐఐసి జెడ్ఎం ను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ లో ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధిలో భాగంగా పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనుల పురోగతిపై కలెక్టర్ డిఆర్ఓ, కర్నూలు ఆర్డీఓ, ఏపీఐఐసి జెడ్ ఎం లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూసేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలు, ఇప్పటివరకు సాధించిన పురోగతి, పరిష్కరించాల్సిన సమస్యలపై కలెక్టర్ ఏపీఐఐసి అధికారులను అడిగి తెలుసుకున్నారు.. పెండింగ్ లో ఉన్న భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, రాబోయే రెండు నుంచి మూడు వారాల్లోగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.. పారిశ్రామిక హబ్ అభివృద్ధి, పరిశ్రమల స్థాపనకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు..
సమావేశంలో డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఏపీఐఐసి జెడ్ఎం మధుసూదన్ రెడ్డి, ఓర్వకల్లు తహసిల్దార్ విద్యా సాగర్ తదితరులు పాల్గొన్నారు..