BREAKING
ప్రజాస్వామ్య పరిరక్షణకు కదం తొక్కనున్న మహా పాదయాత్ర క్షిపణి దాడుల కంటే ఆర్థిక యుద్ధమే కఠినం.. బాలల రక్షణకు ఉపాధ్యాయులే కీలక రక్షకులు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో “లైఫ్ మేనేజ్‌మెంట్”పై అవగాహన కార్యక్రమం ఏ.ఎస్.డీ.డీ ఓటర్లకు మరో అవకాశం కల్పించి అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చాలి. సీపీఐ బలోపేతానికి క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలి - సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి - చాడ వెంకటరెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా - జిల్లా కలెక్టర్ కె.హరిత వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్ -స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం ముదిగుబ్బ సర్పంచ్ బరిలో ఏడుగురు అభ్యర్థులు జలసిరి పనులపై అవగాహన ఫీజుల బకాయిలపై విద్యార్థుల సమరభేరి రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కుమార్తె పెళ్లికి షర్మిళ ఆహ్వానిస్తే రోత రాతలా? -మీడియా సమావేశంలో గొడ్డలిపార్టీ తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం షర్మిల పెళ్లి ఆహ్వానంపై 'సాక్షి' కథనాలపై సీఎం చంద్రబాబు స్పందన భూ సర్వేపై రైతులకు నోటీసుల పంపిణీ జిల్లాలో 151 చెక్ బౌన్స్ కేసుల స్పెషల్ లోక్ అదాలత్ పరిష్కారం

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై ఇద్దరిపై టీడీపీ సస్పెన్షన్ వేటు బాడంగి, లక్ష్మీపురం గ్రామాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి: మండల అధ్యక్షుడు తెంటు రవిబాబు

Select Suryaa Now
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై ఇద్దరిపై టీడీపీ సస్పెన్షన్ వేటు  బాడంగి, లక్ష్మీపురం గ్రామాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి: మండల అధ్యక్షుడు తెంటు రవిబాబు

బాడంగి, నవంబరు 21 (మేజర్ న్యూస్): బాడంగి మండలంలోని బాడంగి, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన అంబటి తవిటి నాయుడు, చీకటి సింహాచలం లను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు తెంటు రవిబాబు తెలిపారు. బొబ్బిలి నియోజకవర్గ నాయకుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.  గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.

బాడంగి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దేవరపల్లి రాజేశ్వరి, లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జాగారపు రవికుమార్‌లను పార్టీ బలపరిచిందని రవిబాబు తెలిపారు. ఈ రెండు గ్రామాల్లోనూ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బాడంగి జడ్పీటీసీ ప్రతినిధి కండి రమేష్, మాజీ ఎంపీటీసీ దేవరపల్లి శ్రీనివాసరావు, చప్ప సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.