భూ సర్వేపై రైతులకు నోటీసుల పంపిణీ
నవాబుపేట సూర్య న్యూస్:
మండలంలోని పోమాల్ గ్రామంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నీటిపారుదల కాలువలు,భూగర్భ మార్గాల నిర్మాణానికి అవసరమైన భూముల సర్వే వివరాలపై గ్రామ రైతులకు జీపీఓ రమేష్,గ్రామ సర్పంచ్ కవిత నరేష్ ఆధ్వర్యంలో శనివారం నోటీసులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రైతులకు వారి భూములకు సంబంధించిన సర్వే వివరాలను నోటీసుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా జీపీఓ,సర్పంచ్ మాట్లాడుతూ నోటీసుల్లో భూమి వివరాలు ఏవైనా తప్పుగా నమోదై ఉంటే సరిచేసుకునేందుకు ఈ నెల 26వ తేదీన పోమాల్ గ్రామంలో గ్రామసభ నిర్వహించనున్నట్లు తెలిపారు.రైతులందరూ గ్రామసభకు హాజరై తమ భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవాలని,ఏవైనా తప్పులుంటే సరిచేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి క్రాంతి,గ్రామ రైతులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.