శంకరాపురం గ్రామ సర్పంచ్ టిడిపి అభ్యర్థిగా మందలపు పూర్ణచంద్రరావు.
శంకరాపురం సర్పంచ్ టిడిపి అభ్యర్థిగా పూర్ణచందర్రావు నామినేషన్.
సూర్య న్యూస్ ముండ్లమూరు. మండలంలోని శంకరాపురం గ్రామ సర్పంచ్ టిడిపి అభ్యర్థిగా మందలపు పూర్ణచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. ఇంటి వద్ద నుండి భారీ ర్యాలీతో టిడిపి మద్దతు దారులతో కలిసి నామినేషన్ కేంద్రానికి వచ్చారు. ముందుగా గ్రామంలోని కోదండరామ స్వామి దేవాలయంలో పూజల నిర్వహించారు. సర్పంచ్,10 వార్డులకు నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ అభ్యర్థి మందలపు పూర్ణచంద్రరావు ను పలువురు అభినందించారు.