BREAKING
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ అక్రిడేషన్ కార్డు చూపించినా అడ్డంకులే..! నామినేషన్ కేంద్రాల్లో పాత్రికేయులకు అవమానమా? అనుమతి నిరాకరణపై జర్నలిస్టుల ఆగ్రహం.. అధికారుల తీరుపై నిరసన చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ నగరం మండలంలో 26 మంది సర్పంచ్, 82 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల రాస్తారోకో 365బీ జాతీయ రహదారిపై ధర్నా.. నిలిచిపోయిన వాహనాల రాకపోకలు ప్రజల అభిప్రాయం మేరకే తన అడుగులు. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి ఇందిరమ్మ కుటుంబ బీమాను సద్వినియోగం చేసుకోవాలి: చైర్‌పర్సన్ పావని కమ్యూనిటీ హెల్పర్స్ లో భాగంగా పోలీస్ స్టేషన్ సందర్శన ఆడబిడ్డకు అండగా సర్పంచ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత! న్యాల్కల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి సిద్దిపేట జిల్లాకు ‘సురక్షిత్’ గుర్తింపు హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో మరో ముందడుగు గవర్నర్‌ను కలిసిన వైసీపీ బృందం.. ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదు రామకృష్ణ పై పీ డి యాక్ట్ నమోదు ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ..... రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికైన న్యూ రిషి పాఠశాల విద్యార్థులు

చిత్తూరు రూరల్‌లో అట్టహాసంగా పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన జయచంద్ర నాయుడు సమన్వయంతో పనిచేసి కూటమిని మరింత బలోపేతం చేయాలి: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్.

Select Suryaa Now
చిత్తూరు రూరల్‌లో అట్టహాసంగా పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన జయచంద్ర నాయుడు సమన్వయంతో పనిచేసి కూటమిని మరింత బలోపేతం చేయాలి: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్.

చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:

చిత్తూరు రూరల్ మండల పరిషత్ పాలకవర్గ ప్రమాణ స్వీకరణ కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, ఎంపీపీ ఆర్. జయచంద్ర నాయుడు, పాలకవర్గ సభ్యులు, కూటమి నాయకులు భారీ ర్యాలీగా చిత్తూరు రూరల్ మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీగా ఆర్. జయచంద్ర నాయుడు, వైస్ ఎంపీపీగా లావణ్య, ఇతర ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో కూటమి నాయకులు సత్తా చాటారని, ఏకపక్షంగా విజయం సాధించడంపై నాయకులు, కార్యకర్తలను అభినందించారు. ఇదే స్ఫూర్తితో ఎన్నికల్లో గెలిచినవారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి కూటమి పార్టీలను మరింత బలంగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పదవులు రానివారు నిరాశ పడవద్దని, పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి నాయకుడు గ్రామాల్లో తిరిగి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. మండల అభివృద్ధి కోసం తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. కూటమి బలంగా ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అందరూ కలిసి పని చేస్తే చిత్తూరు రూరల్ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీపీ జయచంద్ర నాయుడు మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతను ప్రజాసేవకు అంకితం చేస్తానని చెప్పారు. మండలంలోని ప్రతి గ్రామంలో తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. అందరినీ కలుపుకొని, పక్షపాతం లేకుండా అభివృద్ధి పనులు చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సహకారంతో మండలాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు.అనంతరం ఎమ్మెల్యే ఎంపీపీ కార్యాలయాన్ని ప్రారంభించగా, ఎంపీపీగా జయచంద్ర నాయుడు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, జడ్పీటీసీ మంజుల, మేయర్ కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ బి.ఎన్. రాజసింహులు, కూటమి నాయకులు చంద్ర ప్రకాష్, శశికర్ బాబు , వెంకటేష్ యాదవ్, కార్యకర్తలు , మహిళలు, పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు.

చిత్తూరు అర్బన్ రిపోర్టర్,  లవకుమార్