BREAKING
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ అక్రిడేషన్ కార్డు చూపించినా అడ్డంకులే..! నామినేషన్ కేంద్రాల్లో పాత్రికేయులకు అవమానమా? అనుమతి నిరాకరణపై జర్నలిస్టుల ఆగ్రహం.. అధికారుల తీరుపై నిరసన చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ నగరం మండలంలో 26 మంది సర్పంచ్, 82 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల రాస్తారోకో 365బీ జాతీయ రహదారిపై ధర్నా.. నిలిచిపోయిన వాహనాల రాకపోకలు ప్రజల అభిప్రాయం మేరకే తన అడుగులు. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి ఇందిరమ్మ కుటుంబ బీమాను సద్వినియోగం చేసుకోవాలి: చైర్‌పర్సన్ పావని కమ్యూనిటీ హెల్పర్స్ లో భాగంగా పోలీస్ స్టేషన్ సందర్శన ఆడబిడ్డకు అండగా సర్పంచ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత! న్యాల్కల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి సిద్దిపేట జిల్లాకు ‘సురక్షిత్’ గుర్తింపు హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో మరో ముందడుగు గవర్నర్‌ను కలిసిన వైసీపీ బృందం.. ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదు రామకృష్ణ పై పీ డి యాక్ట్ నమోదు ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ..... రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికైన న్యూ రిషి పాఠశాల విద్యార్థులు

జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలి : హేమా సుదర్శన్ జిల్లోజు డిమాండ్

Select Suryaa Now
జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలి :  హేమా సుదర్శన్ జిల్లోజు డిమాండ్

రంగారెడ్డి : గత 18 ఏళ్లుగా సొంత ఇంటి స్థలం కోసం ఎదురుచూస్తూ పోరాటం చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు హేమా సుదర్శన్ జిల్లోజు డిమాండ్ చేశారు. గ్రేటర్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం నిర్వహించిన మహాధర్నాలో ఆమె పాల్గొని జర్నలిస్టులకు సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా హేమా సుదర్శన్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారుతున్నా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వ అధికారులపై జర్నలిస్టులు వాస్తవాలను నిర్భయంగా రాస్తేనే వారి సమస్యలపై ప్రభుత్వాలు స్పందిస్తాయేమోనని వ్యాఖ్యానించారు. జర్నలిస్టులకు ఆర్థిక భద్రత, సొంత ఇళ్లు కల్పిస్తే వారు మరింత స్వేచ్ఛగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో డేటా సెంటర్లు, ఇతర పారిశ్రామిక ప్రాజెక్టుల పేరుతో రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు సేకరించి కార్పొరేట్ సంస్థలకు కేటాయిస్తున్నారని ఆమె ఆరోపించారు. గత ప్రభుత్వాల నుంచి ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరకు పాలకులు మారుతున్నా భూముల వ్యవహారాల్లో ప్రజలకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాటాలు మారుతున్నాయనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు.

జోహార్ నగర్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను కాపాడలేని పాలకులు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. జర్నలిస్టులకు న్యాయం చేస్తామని హౌసింగ్ బోర్డు సొసైటీ ఏర్పాటు చేసి ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన డిమాండ్లు:

  • 18 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలి.
  • అర్హులైన జర్నలిస్టులందరికీ వివక్ష లేకుండా ఇళ్ల స్థలాలు కేటాయించాలి.
  • హౌసింగ్ బోర్డు సొసైటీ ద్వారా ఇచ్చిన హామీలను అమలు చేయాలి.
  • ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలి.
  • ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టి జర్నలిస్టులకు న్యాయం చేయాలి.

ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన జర్నలిస్టుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హేమా సుదర్శన్ స్పష్టం చేశారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లకు ఆమ్ ఆద్మీ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సహాయం అందించాలని ఆమె కోరారు.

వి శ్రీనివాసచారి : రంగారెడ్డి - మేజర్ న్యూస్