BREAKING
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ అక్రిడేషన్ కార్డు చూపించినా అడ్డంకులే..! నామినేషన్ కేంద్రాల్లో పాత్రికేయులకు అవమానమా? అనుమతి నిరాకరణపై జర్నలిస్టుల ఆగ్రహం.. అధికారుల తీరుపై నిరసన చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ నగరం మండలంలో 26 మంది సర్పంచ్, 82 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల రాస్తారోకో 365బీ జాతీయ రహదారిపై ధర్నా.. నిలిచిపోయిన వాహనాల రాకపోకలు ప్రజల అభిప్రాయం మేరకే తన అడుగులు. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి ఇందిరమ్మ కుటుంబ బీమాను సద్వినియోగం చేసుకోవాలి: చైర్‌పర్సన్ పావని కమ్యూనిటీ హెల్పర్స్ లో భాగంగా పోలీస్ స్టేషన్ సందర్శన ఆడబిడ్డకు అండగా సర్పంచ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత! న్యాల్కల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి సిద్దిపేట జిల్లాకు ‘సురక్షిత్’ గుర్తింపు హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో మరో ముందడుగు గవర్నర్‌ను కలిసిన వైసీపీ బృందం.. ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదు రామకృష్ణ పై పీ డి యాక్ట్ నమోదు ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ..... రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికైన న్యూ రిషి పాఠశాల విద్యార్థులు

భావోద్వేగ రాజకీయాలకు బలికావద్దు.. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి: డా. శివ ప్రసాద్

Select Suryaa Now
భావోద్వేగ రాజకీయాలకు బలికావద్దు.. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి: డా. శివ ప్రసాద్

చౌటుప్పల్, మేజర్ న్యూస్:భావోద్వేగాలతో ప్రజలను ప్రభావితం చేసే రాజకీయాలకు బలికావద్దని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డా. చినుకని శివ ప్రసాద్ అన్నారు. ప్రజల భవిష్యత్తు భావోద్వేగాలపై కాకుండా విద్య, వైద్యం, ఉపాధి, అభివృద్ధి, సామాజిక న్యాయంపై ఆధారపడాలని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు భరోసా కల్పించడమే రాజకీయాల ప్రధాన లక్ష్యం కావాలన్నారు. నాయకుల ప్రసంగాలకే పరిమితం కాకుండా వారి పనితీరును ప్రజలు పరిశీలించాలని సూచించారు.

నాయకుల అభిమానులుగా కాకుండా ప్రశ్నించే పౌరులుగా ఎదగాలి. వ్యక్తుల కోసం కాదు.. మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి. భావోద్వేగాలకు కాదు.. ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చే రాజకీయాలను ఆదరించాలి అని డా. చినుకని శివ ప్రసాద్ కోరారు.