ఆమదాలవలస వైస్ ఎంపీపీగా వండాన శ్రీదేవి
ఆమదాలవలస, నవంబర్ 20, మేజర్ న్యూస్
ఆమదాలవలస మండలం వైస్ ఎంపీపీగా నిమ్మతొర్లాడ ఎంపీటీసీగా గెలుపొందిన వండాన శ్రీదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఆమదాలవలస మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈమె ఎంపికపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. వైస్ ఎంపీపీగా శ్రీదేవి నియామకం కావడంతో తోటి ఎంపీటీసీ సభ్యులు, పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు. టిడిపి అభివృద్ధికి ఎంతగానో శ్రమిస్తున్న టిడిపి జిల్లా కార్యాలయ కార్యదర్శి వండాన ఉదయ్ కుమార్ సతీమణి శ్రీదేవికి వైస్ ఎంపీపీగా ఎంపిక చేయడంపై పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల పట్ల ఎంతో అనుభవం కలిగిన ఈమె ఎంపిక వల్ల గ్రామాల అభివృద్ధి బాటలో పయనిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో శ్రీదేవి గ్రామ సర్పంచ్ గా పనిచేసే గ్రామానికి ఎనలేని సేవలు అందించారు. అదే స్ఫూర్తితో మరల వైస్ ఎంపీపీగా ఎంపిక కావడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలకు శ్రీదేవి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో గ్రామాలను అభివృద్ధి చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు