శ్రీనివాస్ క్షేత్రంలో లక్ష తులసి దళాల పూజపూజ
చోడవరం న్యూస్ నవంబర్ 20 కార్తీక మాసం పర్వదినాన సందర్భంగా స్థానిక ఆపద హార శ్రీ వెంకటేశ్వరస్వామి క్షేత్రంలో లక్ష తులసి దాలాల పూజ ఘనంగా నిర్వహించారు ఏట మాదిరిగానే ఈ ఏడాది కార్తీక మాసం ఏకాదశి పర్వదినము కావడంతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి విశేష పూజలు నిర్వహించారు లక్ష తులసిమాల పూజ ఘనంగా నిర్వహించారు లోక కళ్యాణార్థం భక్తిశ్రద్ధలతో వేద పండితులతో అలాగే ఆలయంలో అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేశారు వేదమంత్రోచరణంతో నడుమ ఘనంగా నిర్వహించారు ఈ పూజలు చేయడం వల్ల లోకమంతా సుభిక్షంగా ఉండడం సస్యశ్యామలంగా ఉండడం కోసం పూజలు నిర్వహించడం జరిగింది ఈ పూజకు ఇతర మండలాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు స్వామివారిని దర్శించి గోత్రనామాలతో పూజలు నిర్వహించి స్వామివారిని స్వామివారి అనుగ్రహం పొందారు