BREAKING
బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం గోవింద నామస్మరణతో మార్మోగిన ఎస్.రాయవరం! మాకవరపాలెం జడ్పీటీసీగా అల్లు రామనాయుడు ప్రమాణ స్వీకారం క్రీడల్లో పాల్గొనడం వలన మంచి డైరెక్టర్ వ్యాయామం, అభినందించిన ఏ యూ డైరెక్టర్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆచార్య ఎ. పల్లవి పెనుగొల్లులో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల! గెడ్డపాలెంలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటిన పీవీఆర్! కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య.. హోంమంత్రి అనిత సహకారంతో అభివృద్ధి చేస్తా! కొరుప్రోలు జడ్పీ హైస్కూల్లో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు! ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద పెద్దేరు జలాశయంలో చేప పిల్లల విడుదల కనకమహాలక్ష్మి మార్గశిర ఉత్సవాలకు శ్రీకారం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలి 38వ వార్డులో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు.

15 వ వార్డు అభివృద్ధి దిశగా కృషి - కార్పొరేటర్ ఒమ్మి అప్పలరాజు

Select Suryaa Now
15 వ వార్డు అభివృద్ధి దిశగా కృషి - కార్పొరేటర్ ఒమ్మి అప్పలరాజు

ఆరిలోవ, నవంబర్ 20, మేజర్ న్యూస్ : జీవీఎంసీ, 15 వ  వార్డు సమస్యల పరిష్కార అభివృద్ధి, దిశగా గురువారం  15వ వార్డు కార్పొరేటర్ ఒమ్మి అప్పలరాజు అధికారులతో కలిసి వార్డులో పలు ప్రాంతాల్లో పర్యటించారు.ఈ సందర్భంగా పార్వతి నగర్ కొండ ప్రాంతంలో సపోర్టింగ్ రక్షణ రైలింగ్ నిర్మాణం, అంబేద్కర్ నగర్, ఎస్టీ కాలనీ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామని ఆయన తెలిపారు.   ఒక ప్రణాళిక పద్ధతిలో వార్డు అభివృద్ధి పనులు చేస్తూ రోడ్లు, త్రాగునీరు, మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. పర్యటనలో స్థానికులను అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. త్రాగునీటి వసతులు మెరుగుపరచాలని, ఇంటి నిర్మాణాలు చేపట్టే వారు తప్పనిసరిగా ఇంకుడు గుంతలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇంకుడు గుంతల నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు ఆయనను కోరారు.ఈ పర్యటనలో  సివిల్ వర్క్ ఎ ఈ శ్యామ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ రవి, పారిశుద్ధ్య,మలేరియా విభాగాల ప్రతినిధులు, వార్డు క్లస్టర్ ఇన్‌చార్జి గాడి సత్యం,నాయకులు  రామకృష్ణ, కాఈత గోవింద్, కనకల గురునాయుడు కనకల బంగారునాయుడు,మజ్జి లక్ష్మి, చిన్న, పిట్టా దేవుడు, గుమ్మ విజయ, దువ్వపు లక్ష్మణ్, బసవ దేముడు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు