BREAKING
బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం గోవింద నామస్మరణతో మార్మోగిన ఎస్.రాయవరం! మాకవరపాలెం జడ్పీటీసీగా అల్లు రామనాయుడు ప్రమాణ స్వీకారం క్రీడల్లో పాల్గొనడం వలన మంచి డైరెక్టర్ వ్యాయామం, అభినందించిన ఏ యూ డైరెక్టర్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆచార్య ఎ. పల్లవి పెనుగొల్లులో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల! గెడ్డపాలెంలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటిన పీవీఆర్! కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య.. హోంమంత్రి అనిత సహకారంతో అభివృద్ధి చేస్తా! కొరుప్రోలు జడ్పీ హైస్కూల్లో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు! ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద పెద్దేరు జలాశయంలో చేప పిల్లల విడుదల కనకమహాలక్ష్మి మార్గశిర ఉత్సవాలకు శ్రీకారం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలి 38వ వార్డులో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు.

జడ్పీ చైర్‌పర్సన్‌గా కొరికాన భవాని ప్రమాణ స్వీకారం

Select Suryaa Now
జడ్పీ చైర్‌పర్సన్‌గా కొరికాన భవాని ప్రమాణ స్వీకారం

 

-- వైస్‌ చైర్మన్‌గా గుంటు విజయ్‌ కుమార్‌ బాధ్యతల స్వీకారం

మేజర్ న్యూస్- శ్రీకాకుళం:
జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఎల్‌.ఎన్‌.పేట జడ్పీటీసీ  కొరికాన భవాని (జనసేన), వైస్‌ చైర్మన్‌గా వజ్రపుకొత్తూరు జడ్పీటీసీ సభ్యుడు గుంటు విజయ్‌ కుమార్‌ (తెదేపా) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా జిల్లాలోని 30 మండలాల జడ్పీటీసీ సభ్యులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ప్రమాణం చేయించారు. అనంతరం పరోక్ష ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు.
జడ్పీ చైర్‌పర్సన్‌ పదవికి కొరికాన భవాని పేరును హిరమండలం, ఆమదాలవలస జడ్పీటీసీ సభ్యులు సిరిపురం త్రివేణి, తమ్మినేని సుజాత ప్రతిపాదించారు. జనసేన పార్టీ తరఫున బీ-ఫారం అందడం, ఒకే నామినేషన్‌ దాఖలు కావడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైనట్లు కలెక్టర్‌ ప్రకటించారు. అలాగే వైస్‌ చైర్మన్‌ పదవికి గుంటు విజయ్‌ కుమార్‌ పేరును ఎచ్చెర్ల, కోటబొమ్మాళి జడ్పీటీసీ సభ్యులు విశ్వక్‌ సేన్‌ సయ్యద్‌, పూజారి శైలజ ప్రతిపాదించగా, తెదేపా బీ-ఫారం అందడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్‌ వెల్లడించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. జిల్లాలోని మొత్తం 30 జడ్పీటీసీ స్థానాల్లో తెదేపా 22, జనసేన 5, భాజపా 2, వైకాపా 1 స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు కూన రవికుమార్‌, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, గొండు శంకర్‌, గౌతు శిరీష, సుడా చైర్మన్‌  కొరికాన రవికుమార్‌, జడ్పీ సీఈవో వెంకటరమణ, డిప్యూటీ సీఈవో భారతి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.