BREAKING
బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం గోవింద నామస్మరణతో మార్మోగిన ఎస్.రాయవరం! మాకవరపాలెం జడ్పీటీసీగా అల్లు రామనాయుడు ప్రమాణ స్వీకారం క్రీడల్లో పాల్గొనడం వలన మంచి డైరెక్టర్ వ్యాయామం, అభినందించిన ఏ యూ డైరెక్టర్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆచార్య ఎ. పల్లవి పెనుగొల్లులో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల! గెడ్డపాలెంలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటిన పీవీఆర్! కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య.. హోంమంత్రి అనిత సహకారంతో అభివృద్ధి చేస్తా! కొరుప్రోలు జడ్పీ హైస్కూల్లో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు! ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద పెద్దేరు జలాశయంలో చేప పిల్లల విడుదల కనకమహాలక్ష్మి మార్గశిర ఉత్సవాలకు శ్రీకారం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలి 38వ వార్డులో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు.

అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా మోటూరు నాగమణి, వైస్ చైర్ పర్సన్ గా పెంటకోట స్వాతి ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా మోటూరు నాగమణి, వైస్ చైర్ పర్సన్ గా పెంటకోట స్వాతి ఏకగ్రీవ ఎన్నిక

 

 

అనకాపల్లి ప్రతినిధి,  నవంబర్ 20, మేజర్ న్యూస్:  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మరియు వైస్ చైర్ పర్సన్ ల ఎన్నిక ప్రశాంతమైన వాతావరణంలో జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ తెలిపారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో  జిల్లా కలెక్టర్ అధ్యక్షతన చైర్ పర్సన్ మరియు వైస్ చైర్ పర్సన్ ల ఎన్నిక జరిగింది.
రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయకుమార్, కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, బత్తుల తాతయ్య బాబు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు.ముందుగా జిల్లా కలెక్టర్ జిల్లాలో గల 24 మండలాలలో గెలుపొందిన జడ్పిటిసి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా పరవాడ జడ్పిటిసి సభ్యురాలు మోటూరి నాగమణిని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అభ్యర్థిగా నర్సీపట్నం జడ్పిటిసి అభ్యర్థి సుకల రమణమ్మ ప్రతిపాదించగా, కసింకోట జడ్పిటిసి అభ్యర్థి పొన్నగంటి నాగమణి బలపరిచారు. మిగిలిన జడ్పిటిసి సభ్యులు అంగీకరించడంతో ఏకగ్రీవంగా మోటూరి నాగమణిని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఎన్నికయ్యారు.జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ గా మునగపాక జడ్పిటిసి సభ్యురాలు పెంటకోట స్వాతిని అనకాపల్లి జడ్పిటిసి సభ్యులు పల్లెల నాగేశ్వరరావు ప్రతిపాదించగా, బుచ్చయ్యపేట జడ్పిటిసి సభ్యురాలు పోతుల భవాని బలపరిచారు. మిగిలిన జడ్పిటిసి సభ్యు లు ఆమోదించడంతో ఏకగ్రీవంగా పెంటకోట స్వాతి జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లాలోని 24 జడ్పీటీసీ  స్థానాలకు సంబంధించి 24 మంది సభ్యులు నేడు ప్రమాణస్వీకారం మరియు చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ ఎన్నికకు  హాజరయ్యారని తెలిపారు. పరవాడ జడ్పీటీసీ సభ్యురాలు మోటూరు నాగమణి చైర్ పర్సన్ గా మరియు మునగపాక జడ్పీటీసీ సభ్యురాలు పెంటకోట స్వాతి వైస్ చైర్‌పర్సన్ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.జడ్పిటిసి సభ్యులు గా  తెలుగుదేశం పార్టీ నుండి అమలకంటి రమణమ్మ ,  అల్లు రామనాయుడు,  కనిశెట్టి సన్యాసిరావు, గోరా చంద్రశేఖర్, కోటా నీలవేణి,  కురచ రమేష్, పల్లెల నాగేశ్వరరావు, నాగవేణి పురం, గంట్యాడ రమేష్, రమణమ్మ సుకల, పుప్పాల లక్ష్మీనారాయణ, పీలా హైమావతి, లెక్కల సన్యాసి నాయుడు, రొంగలి మహేశ్వరరావు, రాజేశ్వరి కిలపర్తి, సుర్ల సత్యం నాయుడు, స్వాతి పెంటకోట,  జనసేన పార్టీ నుండి సేనాపతి రత్నం, మోటూరు నాగమణి, రావి చలపతి, మామిడి అరుణ, పోతుల భవాని, బిజెపి పార్టీ నుంచి పొన్నగంటి నాగమణి, శ్రీరంగం బ్రమరేశ్వరి ఎన్నికయ్యారు. చివరగా రాష్ట్ర హోం శాఖ  మంత్రి వంగలపూడి అనిత తో పాటు  శాసనసభ్యులు మరియు కార్పొరేషన్ల చైర్మన్లు గెలుపొందిన జడ్పిటిసి అభ్యర్థులను శాలువ కప్పి సన్మానించి, అభినందనలు తెలియజేశారు.